ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. అమరావతి రాజధానిగా ఉంచాలని టీడీపీ.. కాదు అభివృద్ధికోసం వికేంద్రీకరణలో భాగంగా పాలన కూడా ముచ్చటగా మూడుచోట్ల ఉండాలని అధికార వైసీపీ పట్టిన పట్టు విడవకుండా పోరాడుతుంది. ఇదే సమయంలో తమకు అడ్డువచ్చిన వాటిని అడ్డంగా లేపేసేందుకు కూడా అధికార పార్టీ ఏమాత్రం సంకోచించడం లేదు. ఇలాంటి సమయంలో ఏపీలోని ప్రదాన పార్టీలైన వైసీపీ.. టీడీపీ మధ్య తీవ్ర వార్ నడుస్తోంది. అందులో భాగంగా ఇదే విషయంపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు.

సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. “ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్నిఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు. వైఎస్సార్ గారు పునరుద్ధరించడాన్ని మాత్రమే పదేపదే చెబుతున్నారు. 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు.”,

అదేవిధంగా జీవనోపాధి లేక వలసలు వెళ్లే ఉత్తరాంధ్ర ప్రజల మీద నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు? ఈనాడు, చంద్రజ్యోతిలతో జిఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారు. ముంబై, చెన్నైలకు కూడా తుఫాను తాకిడి ఉంది. విశాఖకు అంతే. అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారెందుకు?”అని.. విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతేకాకుండా ‘భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుంది. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, మీరు చేయని అక్రమాలు లేవు.’ అంటూ సంచలన ట్వీట్లు పెట్టి మరోసారి హాట్ టాపిక్ గా మారారు విజయసాయిరెడ్డి. మొత్తానికి ట్విట్టర్లో విజయసాయిరెడ్డి ట్వీట్లకు క్రేజ్ ఎక్కువ అనేది మరో సారి వైరల్ గా మారడమే అందుకు నిదర్శనం.