ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచీ వినిపిస్తున్న అంశం జిల్లాల పెంపు. అది ఒక్కో పార్లమెంట్ ను ఒక్కో జిల్లాగా చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు చాలా కాలంగా అందుతున్న సమాచారం. ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మూడు జిల్లాలనే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేంటి అప్పట్లో మొత్తం ఏపీలో 25జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమౌతుందని ఆశపెట్టి మూడే ఏర్పాటు చేయడమేంటని చర్చ సాగుతుంది.

అయితే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అవీ మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని టాక్. ఇప్పటికే మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉంది. అలాగే.. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్లు తెలుస్తుంది.

అయితే వీటినే ఇంత హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేయడానికి కారణం లేకపోలేదు. అదేమంటే.. ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, అరకు, గురజాలల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుంది. వైద్య వసతులు తక్కువగా ఉండి వెనుకబాటుకు గురై, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు నిధులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సమకూర్చే అవకాశం ఉంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా హడావుడిగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతోపాటు మిగతా కొత్త జిల్లాలను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తారని సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నర్సరావుపేట జిల్లా కావాల్సింది. కానీ నియోజకవర్గం పరిధిలోని గురజాలను జిల్లా చేయడంతో.. దాన్నే జిల్లాగా కొనసాగించే అవకాశం ఉంది.

మొత్తానికి వైఎస్ జగన్ ప్లానే వేరబ్బా అంటూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. సహజంగా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలంటే… రూ.600 కోట్ల దాకా ఖర్చవుతుంది. ఐతే… బాగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే… వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)… ఇస్తుంది. అంటే… మొత్తం రూ.1800 కోట్లు అవుతుందనుకుంటే… MCI నుంచీ రూ.1080 కోట్లు వస్తాయి. ఫలితంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.720 కోట్లే. అసలే ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. అప్పులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అందువల్ల పొదుపులు చేసేందుకు వీలయ్యే అన్ని మార్గాల్నీ వైఎస్ జగన్ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలో MCI నుంచీ మనీ పొందేందుకు ఆ మూడు ప్రాంతాల్నీ జిల్లాలుగా మార్చనున్నట్లు సమాచారం. చూద్దాం మిగిలినవి ఎప్పుడు జిల్లాలుగా ఏర్పడతాయో.. ఏమైనా జగన్ స్కెచ్చే వేరప్పా..