ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా 3రాజధానులపై తీవ్రమైన ఉధ్యమే సాగింది. చిన్నచిన్నగా అది సన్నగిల్లుతోంది. అది ఎలాగంటే.. మొన్నటివరకు అమరావతి ప్రాంత రైతులు మాత్రమే అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమిస్తే.. ఇప్పుడు అది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ పాకింది. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని.. అందుకు వికేంద్రీకరణ.. పాలన.. అధికారాలు సమానంగా అందరికీ అందేలా ఉండాలనే కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆ దిశగా ఏపీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈ విషయంలో రాజకీయంగా కూడా వైఎస్ జగన్ సర్కార్ చాలా సాహసం చేసి మరీ.. శాసనసభను రద్దు చేయడం వంటివి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం.. కేంద్రం కోర్టులో బంతి ఉన్నప్పటికీ.. ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అంటూ సిగ్నల్స్ కూడా ఇచ్చేసింది కేంద్రం. ఆ రకంగా రాష్ట్రప్రభుత్వానికి చెందిందే ఆ విషయమని చెప్తున్నప్పటికీ పరువురు నేతలు, పలు పార్టీలు ఇంకా రాజధాని అంశంపై తీవ్రమైన మాటల తూటాలు పేలుస్తున్నాయి.

తాజాగా విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి అమరావతి నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లా శివారు అయిన గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలకు తాజాగా స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఉత్సవాలకు విచ్చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు అన్ని విషయాలను వివరించారు.

అంతేకాకుండా గతంలో యాగాలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డిని గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఇప్పుడు యాగం చేయాలని వారిని మహిళలు కోరారు. అయితే వారి మాటలకు సమాధానం చెప్పకుండానే స్వరూపానందేంద్ర అక్కడి నుంచి వెళ్లారు. దీంతో మహిళలు కాస్త ఆగ్రహానికి గురైన ఏమి చేయలేని పరిస్థితి కదా మరి. కాగా
అప్పట్లో అమరావతి కోసం స్వామీజీ పూజలు చేశారని, ఇప్పుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ప్రశ్నించారు. ఈ విషయంపై అడిగేందుకు వస్తే పోలీసులు నెట్టివేశారని.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా తమను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పడు చెప్పవచ్చేదేమిటంటే… ఆ మహిళలు నిజంగా హిందూమతాన్ని అంతగా ఆరాధిస్తే.. అప్పట్లో వైఎస్ జగన్ అమరావతిలో పాదయాత్ర చేసినప్పుడు పసుపు నీళ్లు ఎందుకు చల్లినట్లు అంటూ వైసీపీ మహిళా కార్యకర్తలు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీనికేమంటారు టీడీపీ మహిళలూ..