ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా 3రాజధానులపై చీవ్రమైన ఉధ్యమం సాగుతుంది. అది ఎలాగంటే.. మొన్నటివరకు అమరావతి ప్రాంత రైతులు మాత్రమే అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమిస్తే.. ఇప్పుడు అది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ పాకింది. ఈ విషయంలో రాజకీయంగా కూడా వైఎస్ జగన్ సర్కార్ చాలా సాహసం చేసి మరీ.. శాసనసభను రద్దు చేయడం వంటివి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం.. కేంద్రం కోర్టులో బంతి ఉన్నప్పటికీ.. ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అంటూ సిగ్నల్స్ కూడా వచ్చేశాయి. కేంద్రం ఆ రకంగా రాష్ట్రప్రభుత్వానికి చెందిందే ఆ విషయం చెప్తున్నప్పటికీ పరువురు నేతలు, పలు పార్టీలు ఇంకా రాజధాని అంశంపై తీవ్రమైన మాటల తూటాలు పేలుస్తున్నాయి.

అదేవిధంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు రాజధాని అంశంపై మాట్లాడి మాట్లాడి.. అలసి పోయారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ఏపీలో కమ్యనిష్టులగా చెప్పుకొని తిరిగే.. రామకృష్ణ, నారాయణ వంటి నేతలతో కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ పోరాటాన్ని చేయించాడు. అందులో భాగంగా ఏపీలోని కమ్యూనిష్టు నేతలు కూడా విచిత్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కచోటే ఉండాలంటూ వాపోతున్నారు. వీరు అభివృద్ధి ఆటంకవాద శక్తులుగా మారి అడ్డుపడుతున్నారంటూ అధికార పార్టీ నుంచి ఘాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

తాజాగా వైజాగ్ లో పర్యటించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ.. బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి సంబంధాలను బయటపెట్టబోయి బొక్క బోర్లాపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగదని నారాయణ పేర్కొనడం విశేషం.

అంతేకాకుండా బీజేపీ నాయకులు కేంద్రంలో ఓ నాటకం, రాష్ట్రంలో మరో నాటకం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. కలిసి కాపురం చేస్తున్నామని బీజేపీ, వైసీపీ బహిరంగంగానే ప్రకటించవచ్చని ఎద్దేవా చేసిన నారాయణ.. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు అవసరం లేదని కూడా వివరించారు. బీజేపీ, వైసీపీలు లీగల్‌గా కాపురం చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని కూడా నారాయణ వ్యాఖ్యానించారు. అంతవరకు బాగానే ఉందిగానీ.. హైకోర్టును రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోమని.. సచివాలయం, అసెంబ్లీ మాత్రం ఒకేచోట ఉంచాలని నారాయణ స్పష్టం చేశారు. ఈ లెక్క నారాయణ కూడా అమరావతిలో ఒకమాట.. వైజాగ్ లో మరో మాట మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు వైస్ జగన్ పెద్దమనసుతో కనీసం అసెంబ్లీ అయినా.. అమరావతిలో పెడుతున్నారని.. అవి కూడా లేకుండా సీపీఐ నారాయణ ప్లాన్ చేస్తున్నారని.. ప్రజలు వాపోతున్నారు. చిలికి చిలికి గాలివానగా సచివాలయం, అసెంబ్లీ ఒకేచోట పెట్టాలని ఇది మాత్రం సీపీఐ నారాయణ ఉద్యమిస్తే.. అదో పెద్ద ఉద్యమంగా మారితే.. తప్పకుండా వైఎస్ జగన్ ఆలోచించి అవి రెండూ ఒకే చోట వైజాగ్ లోనే పెట్టేందుకు చర్యలు తీసుకోవచ్చినే టాక్ కూడా నడుస్తోంది. మొత్తానికి ఇప్పుడు నారాయణ మాటలు అమరావతి ప్రజలను మరింత ఇరకాటంలోకి నెట్టేట్టుగా ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ టీడీపీతో కలిసి సీపీఐ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రెండూ ఎక్కడైనా సరే ఒకేచోట ఉండాలని సీపీఐ నారాయణ పోరాడటం రెండు నాల్కల ధోరణికి అద్దం పట్టేలా ఉందని టీడీపీ కూడా ఆవేదన చెందుతోంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.