ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు సంచలనాలకు దారితీస్తున్నాయి. సీఎంగా వైఎస్ జగన్ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తూ.. చాలా వేగంగా వ్యవస్థలోని లొసుగులను ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కొత్తగా అధికారాన్ని చేపట్టి సీఎంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేలా పాలన సాగించారని.. ఆ విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. సమూల మార్పులు చేస్తూ ఎక్కడికక్కడ విధాన లోపాలను సరిచేస్తూ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల్లో ఎంతో చైతన్యంగా మారింది.

ముఖ్యంగా తొలిసారిగా ఏపీలో చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టించిన ప్రజాదర్బార్ ను కూల్చేయడం ఎంతో సంచలనానికి దారితీసింది. ఆ తర్వాత గతంలో ఇసుక విచ్చలవిడిగా దోపిడీకి గురైంది. ఆ విధానాన్ని పూర్తిగా మారుస్తూ వైఎస్ జగన్ కొత్త ఇసుక పాలసీని రూపొందించారు. అది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కాస్త ఆలస్యమైనా ప్రభుత్వానికి ఆదాయమార్గంగా రావడంతో ప్రజలంతా హర్షిస్తున్నారు. అదేవిధంగా మహిళా రక్షణ కోసం దిశ చట్టం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను తప్పనిసరిగా ప్రవేశపెట్టడం, విద్యా, వైద్యం అన్ని రంగాలలోనూ సరికొత్త విధానంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఆచరణాత్మకంగా దూసుకుపోతుంది.

తాజాగా ఏపీ రాజధాని అమరావతే కాకుండా అభివృద్ధి.. పాలన వికేంద్రీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్. దీంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళన వచ్చింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించి వికేంద్రీకరణ దిశగా తీర్మానం చేసింది వైఎస్ జగన్ సర్కార్. అయితే శాసన మండలిలో ఆ తీర్మానం టెక్నికల్ విభాగంలోకి బలవంతంగా నెట్టబడి అది ఇప్పుడు శాసన మండలి రద్దు దిశగా అసలుకే ఎసరు తెచ్చిపెట్టుకుంది టీడీపీ పన్నిన వ్యూహాత్మకమైన వైఫల్యం.

అదంతా పక్కన బెడితే అసలు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు కాకరేపుతుంది. అయితే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిర్మాణాత్మకంగా చాలా వెరైటీగా ముందుకు అడుగులు వేస్తుంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నా ఈ ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే వచ్చిందని చరిత్ర చెప్తుంది. ఏపీ రాజధానిగా విశాఖపట్టణం పేరు వినిపిస్తుండటంతో అందరి చూపూ ఇప్పుడు ఈ మహానగరంపైనే పడింది. ఇప్పుడు మండలి విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక విశాఖపట్నం రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఈ నాటిది కాదని.. పోర్టు సిటీని రాజధాని చేయాలని 66 ఏళ్ల క్రితమే ఓ ప్రతిపాదన తెరపైకొచ్చినట్లు తెలుస్తుంది. 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక విశాఖను రాజధాని చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే అప్పటి పరిస్థితులు వేరేలా ఉండేవి.

అయితే విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని 1953లోనే ప్రతిపాదించడం జరిగింది. నాటి అసెంబ్లీలో 30 నవంబర్ 1953లో విశాఖను రాజధానిగా రొక్కం లక్ష్మీ నరసింహ దొర అధికారిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1956 ఏప్రిల్1 వరకు కర్నూలు రాజధానిగానే కొనసాగిస్తూ ఆ తర్వాత రాజధానిని విశాఖపట్నంకు తరలించాలన్న చట్టసవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో రెండు ఓట్ల ఆధిక్యతతో బిల్లు నెగ్గినట్లు అప్పటి అసెంబ్లీ స్పీకర్ నల్లపాటి వెంకట్రామయ్య సభలో ప్రకటించారు. విశాఖను ఏపీ శాశ్వత రాజధానిగా ఉంచాలని అప్పటి మీడియాలో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి.
ఇక కర్నూలులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులతో పాటు ఇతర సభ్యులు కూడా సభలో ఉన్నట్లు ఆ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. ఈ సమావేశాలకు స్పీకర్‌గా నల్లపాటి వెంకట్రామయ్య ఉన్నట్లు ఆ వార్త ద్వారా తెలుస్తోంది. విశాఖను 1 ఏప్రిల్ 1954 నుంచి శాశ్వత రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదనపై ముందుగా ఓటింగ్ జరిగినట్లు ఆయా పత్రికలు ప్రచురించాయి కూడా. అయితే ప్రభుత్వం అందుకు వ్యతిరేకించినట్లు పత్రిక కథనంలో ప్రచురించింది. ఆ తర్వాత రొక్కం నరసింహ దొర ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

అదే సమయంలో మరో సభ్యులు లుకాలపు లక్ష్మణ్ దాస్ కూడా మరో ప్రతిపాదనను ప్రవేశపెట్టడంతో ఆ ప్రతిపాదనను సమర్థించారు కాంగ్రెస్ నేత కృష్ణమూర్తి. కర్నూలును 1అక్టోబర్ 1956 వరకు రాజధానిగా కొనసాగిస్తూ ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన విశాఖపట్నంకు రాజధానిని తరలించాలనేది ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విశాఖపట్నంకు అన్ని అర్హతలున్నాయని లక్ష్మణ్ దాస్ వెల్లడించారు. ఆ మహానగరం వాతావరణం, షిప్‌యార్డు, సహజవనరులతో విశాఖకు అన్ని అర్హతలున్నాయన్నారు. అయితే భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాల్సి వస్తే విశాఖపట్నం రాజధానిగా ఉండకూడదని ఆయన చెప్పారు. కర్నూలు వాసులు కూడా రాజధానిగా విశాఖకు అనుకూలంగా ఉన్నప్పటికీ… విశాలాంధ్ర ఏర్పాటు అయితే రాజధాని హైదరాబాదు చేయాలని ప్రతిపాదన ద్వారా తెలుస్తోంది. దీంతో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే తెరపైకి వచ్చిందనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ సమయంలో అసెంబ్లీలో రొక్కం నరసింహ దొర ప్రవేశపెట్టిన బిల్లుకు 60 మంది అనుకూలంగా ఓటు వేస్తే.. 58 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు… దీంతో రెండు ఓట్ల మెజార్టీతో విశాఖ రాజధానిగా బిల్లు పాస్ అయ్యింది. మొత్తానికి చారిత్రకంగా.. ఆర్థకంగా.. సామాజికంగా చూసుకుంటే ఇప్పడు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న విశాఖపట్టణం పరిపాలన రాజధాని నిర్ణయం సమంజసమే.