ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది. అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పడున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తర కుమారుడు అంటూ దేవినేని తతను వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. నన్ను ఉత్తర కుమారుడు అని దేవినేని ఉమ అంటున్నారని…అయితే అసలు ఉత్తర కుమారుడు ఎవ్వరో అందరికీ తెలుసని.. మీ పప్పుగా లోకం చేత పిలవబడే లోకేష్ బాబే ఉత్తర కుమారుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. ఇంకా అసలు దేవినేని ఉమాను తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమన్నారో తెలుసా.. ఉమా.. అంటే అసలు ఆయన ఆడా.. మగా ఏంటో చెప్పండి అంటూ తెలిపారని.. దీన్ని బట్టి అసలు ఉమా ఏంటో తెలుసిపోతుందని వెల్లడించారు.

అదేవిధంగా నాలో బెరుకు, భయం లేదని తెలిపిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్… మీ నాయకుడు చంద్రబాబును అడిగితే ఆ విషయం చెప్తారని కూడా వివరించారు. అదేవిధంగా తన చదువు గురించి కామెంట్ చేయడంపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నా చదువు గురించి ప్రపంచానికి తెలుసని అన్నారు. అలాగే నోరుంది కదా అని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదిపడితే అది మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఏదేమైనా 2022లో మా నాయకుడితో పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

అంతేకాకుండా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అంటూ జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడి చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు పూర్తి చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్‌ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

అంతటితో ఆగకుండా టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. దానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామని.. కొత్త బట్టలు కూడా పెడతామని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌లో వెయ్యి కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆడా.. మగా కానీ ఉమా.. తనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. చివరగా ట్విస్ట్ గా ఏమన్నారంటే.. ‘నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు.. నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో’ అంటూ ఉమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.