ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తజేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిశోర్‌ ను ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందించారు. ఏకంగా ప్రశాంత్ కిశోర్ కి బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)దేశ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు మద్దతిచ్చిన నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించినందున ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించాలని కోరారు.

అదేమంటే.. గత ఎన్నికల్లో వైసీపీకి సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. సీఏఏఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించండి అంటూ ప్రశాంత్ కిశోర్‌కు రామకృష్ణ రాసిన లేఖలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వైఎస్ జగన్‌కుప్రశాంత్ కిశోర్‌కు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే బీజేపీ భాగస్వామ్యపక్షమైన జేడీయూకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. సీఏఏఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో తాజాగా ప్రశాంత్ కిశోర్‌తో పాటు పవన్ వర్మను పార్టీ నుంచి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ బహిష్కరించారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశాంత్ కిశోర్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సలహా ఇవ్వండి అంటూ కోరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి సంచలనం రేపుతున్నాయి.   

అయితే 2014లో నరేంద్ర మోడీని పీఎం చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా బిహార్‌లో జేడీయూ అధికారం చేపట్టడం, నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వ్యూహాలు మెండుగానే ఉన్నాయి. దాంతో పీకేకి.. పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించారు నితీశ్ కుమార్. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉపాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఇరు పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. బిహార్‌ సీఎంజేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ కూడా ప్రశాంత్‌ కిశోర్ తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీలో కొనసాగాలంటే నిబంధనలువిధానాలకు లోబడి పనిచేయాలని.. లేనట్లయితే పార్టీని వీడవచ్చంటూ నితీశ్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ.. పార్టీ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అందుకు ప్రశాంత్‌ కిషోర్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు. థాంక్యూ నితీశ్‌ కుమార్‌. మీరు మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ ంటూ తమదైన స్టైల్లో యువకిశోరంలా స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ పరిణామాలన్నింటినీ గమనించి పీకీ గడ్స్ కి థ్యాంక్స్ చెప్తూ మన కమ్యూనిస్ట్ లీడర్ రామకృష్ణ లేఖ రాసేశారు. అసలు విషయం ఏమిటంటే.. జగన్ కి ప్రశాంత్ కిశోర్ కి ఉన్న సంబంధాలు బలమైనవి. తుమ్మితే ఊడిపోయేవి కాదని రామకృష్ణ గ్రహించాలి అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్స్ పేలిపోతున్నాయి. ఇలాంటి ఇంట్రస్టింగ్ న్యూస్ చూడాలంటే.. మా ప్రజాచైతన్యం ఛానల్ ను చూస్తూ ఉండండి.  అంటిల్ దెన్ బాయ్ బాయ్.