ఆంధ్రప్రదేశ్ నుంచి కియామోటార్స్ తరలిపోతుందంటూ ఓ దుష్ప్రచారాన్ని అల్లింది టీడీపీ. ఆ తర్వాత తమ ఎల్లో మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేయించుకుంది. తీరా ఆ కంపెనీ ప్రతినిధులే అలాంటి ఊసే లేదని చెప్పడంతో ఆ టీడీపీ గోబెల్స్ బృందాల పరువలుపోయింది. మొత్తానికి ఇది.. రకమైన గోబెల్స్ ప్రచారానికి టీడీపీ ఏకంగా ఓ బృందాన్నే నియమించుకున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అసలు ప్రధాని నరేంద్ర మోడీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది తన వల్లే… జరిగిందని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏపీకి తెచ్చిన ఘనత తనదేనంటూ విపరీతంగా ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలా కాలంగా వినిపిస్తున్న అప్రస్తుతం ప్రచారం. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్ల గుడ్డలు కప్పి మరీ.. అదిగో నావల్లే కియా నుంచి ఫస్ట్ కారు రిలీజ్ అయిందని కూడా డబ్బాకొట్టారు చంద్రబాబు. అదే సమయంలో ఆ బ్లాక్‌క్లాత్ బాగోతం బట్టబయలై అది కియా కారు కాదని స్పష్టమై పరువు పోయింది. ఈ మధ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కియామోటార్స్ ప్రారంభోత్సవంలో పాల్లొని తొలి కారును లాంఛ్ చేశారు. ఇదీ అక్కడ జరిగిన నిజం అన్నది కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఓ రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానులపై విపరీతంగా దుష్ప్రచారాన్ని మొదలెట్టిన టీడీపీ అందుకోసం ఏకంగా ఏ బృందాన్ని ఏర్పాటు చేసుకుందని టాక్ నడుస్తోంది. ఇప్పటి నుంచి రాబోవు ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు తన వ్యూహాలను పక్కాగా ఆచరించేందుకు ఈ బృందం పని చేస్తుందని తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ అడ్డాగా ఈ పనులు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక్కడ జరిగిన రచన ఆ తర్వాత అధి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా.. ఆయన అనుకుల మీడియా పచ్చ ఛానళ్లు విపరీతంగా ప్రచారానికి సహకరించేలా ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ట్రైల్ రన్ గా మూడు రాజధానుల రచ్చ చల్లబడుతుండటంతో హాట్ హాట్ గా.. కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ హాట్ బజ్జి ఒకటి అల్లేసి వేసేశారు. కానీ.. అది ఎంత వేగంగా వేశారో.. అంతే వేగంగా.. చల్లారిపోయింది. వేసింది బజ్జీ అయినప్పటికీ.. అందులోని మిరపకాయ అంత ఘాటుగా పారలేదు.. ఎందుకంటే.. అది నిజమైన మిర్చిబజ్జీ కాదని అందరికీ తెలిసిపోయింది.

అయితే టీడీపీ అల్లిన ఈ వింత విడ్డూరమైన ప్రచారానికి వైసీపీ కూడా అంతే ఘాటుగా అటాక్ చేసింది. కియామోటార్స్‌‌ తరలింపు వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కియామోటార్స్ అనేది మొట్టమొదటగా తమిళనాడుకు తరలిపోకుండా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించిన ఘనత ప్రధాని మోడీగారికి దక్కుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇన్నాళ్లు చంద్రబాబుకు ఉన్న కాస్తో కూస్తో క్రెడిట్ మోడీకి ఇచ్చేసి ఆ రకంగా చంద్రబాబు పరువు తీసేశారు. ఏపీకి కియామోటార్స్ రావడంలో చంద్రబాబునాయుడు కృషి ఏ మాత్రం లేదని కూడా స్పష్టం చేశారు. అసలు కియా మోటార్స్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని ఆరోపించారు. పైగా ఇప్పుడు కియామోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ…దుష్ప్రచారం చేయిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు బ్రతుకే.. ఇంత అని… ఆయన ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని విరుచుకు పడ్డారు. అంతటితో ఆగకుండా కియా మోటార్స్ కు ఎలాంటి సహకారం కావాలన్నా ఏపీ ప్రభుత్వం అందిస్తుందని.. అలాగే.. ఇంకా.. కియా మోటార్స్ ఏపీలో విస్తరించే అవకాశం కూడా ఉందని విజయసాయిరెడ్డి వివరించారు. కియా మోటార్స్ తరలిపోతుందనడం పెయిడ్ న్యూస్ అంటూ విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారు. అలాగే.. ఇప్పుడు మరో వార్త కూడా వినిపిస్తోంది. చంద్రబాబును.. ఆయన బృందాన్ని.. ఎల్లో మీడియాను.. ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఏకంగా టీడీపీ గ్యాంగ్ ఫేమస్ ఇంగ్లీషు వెబ్ సైట్లను, ఫేమస్ ఇంగ్లీషు న్యూస్ ఛానళ్లు, పేపర్లను జోకొడుతుందని.. ఆరకంగా వైఎస్ జగన్ సర్కార్ పై మరింత దుష్ప్రచారం చేయించేలా ప్లాన్ చేస్తుందని కూడా సమాచారం అందుతుంది. దీనిపై ఏపీ ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ సర్కార్ ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు తావు లేకుండా చాలా కూల్ గా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే.. ఇలా ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయడం టీడీపీకి పద్ధతి కాదని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.