ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడి తర్వాత మొదట టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ.. టీడీపీ.. జనసేన కలయికతో ఏర్పాటైన ఆ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండి విచ్చల విడి అవినీతికి పాల్పడింది. ఒక ఇసుక విషయంలోనే కాకుండా రాజధాని అమరావతి విషయంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లోనూ.. ప్రాజెక్టుల టెండరింగ్ లోనూ.. చిన్నపాటి కార్యకర్త నుంచి బడా నేత వరకు.. జన్మభూమి కమిటీల నుంచి బడా నేతల వరకు అంతా దోపిడీనే. భూదందాలకు ఇక లెక్కలేదు. టీడీపీ నేతలు చేసిన దోపిడీ పార్టీలో అంతర్భాగంగా ఉన్న బీజేపీకి కూడా వెగటు పుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియంత పోకడలు.. రాజధానిపై అనాలోచిత ధోరణితో విసుగు కలిగింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో దుబారా ఖర్చు చేయడం ప్రభుత్వం ఆచితూచి నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అదీ విధానపరంగా అభివృద్ధికి దోహదపడేదిగా ఉండాలి. అలాంటిదేం చేయకుండా బాబు పాలన బంధుప్రీతికరంగా సాగింది. ప్రతి పనిలోనూ నీకెంత.. నాకెంత అన్న చందంగా సాగింది. దీంతో ప్రజలకు మండింది. ఐదేళ్లపాటు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది ప్రభుత్వం. చేసిన అభివృద్ధి కనిపించకుండా పోయింది. చేసేది లేక ప్రజల్లోకి వెళ్లలేక.. ప్రత్యేక హోదా అనే కొత్తఎత్తుతో మింగలేక.. కక్కలేక బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది.

ముఖ్యంగా రాజధానిగా అమరావతి విషయంలోనూ.. ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఘోరమైన వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు. విజయవాడ.. గుంటూరు మధ్యలో ప్రధాన రహదారులను ఆశ్రయించి.. వాటికి అనుకూలంగా జంటనగరాలను అభివృద్ధి చేసేందుకు పూనుకుంటే కొంతవరకైనా చంద్రబాబు బయటపడేవారు. కానీ.. లోలోపలకు రాజధానిని తీసుకెళ్లి.. కొత్తగా శూన్యం నుంచి నవ నగరాలను చేద్దామని.. చివరకు ఎన్నికల్లో గ్రాఫిక్స్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో బాబు తంతును అంతా గమనిస్తున్న ప్రజలు వేచి చూసి మరీ వేటు వేశారు. కోలుకేలేని దెబ్బ చావు దెబ్బ కొట్టారనే చెప్పాలి. ఇది ఎంతటిదంటే.. ఇక కొంచమైనా కోలుకోవాలి అంటే.. పార్టీకే సుమారు రెండు దశాబ్దాల కాలం మినిమం పట్టే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దశలో ఏపీలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన స్థాయి నుంచి వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక్కో వ్యవస్థను నిర్మాణాత్మకంగా గాడిలో పెట్టేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని సమూల మార్పులు తెస్తూ.. ఎన్నో ఏళ్లుగా వేళ్లూనికొని ఉన్న వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ.. అత్యంత పారదర్శనకంగా సుపరిపాలన అందిస్తున్నారు వైఎస్ జగన్.

అయితే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం ఎక్కువ నిధులు ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా అభివృద్ధిలో ఏపీ నిలవాలంటే అన్ని రకాలుగా కేంద్రం నిధులతో ఆదుకోవాలి. ఇందుకోసం గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి నిధుల తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు వైసీపీ మాత్రం సరికొత్త ఎత్తువేస్తూ.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో సత్ఫలితాలను సాధిస్తుంది.ముఖ్యంగా కేంద్రంతో సఖ్యంగా ఉండటం.. వారికి అవసరమైనప్పుడు చట్టసభల్లో తగిన సాయం అందించడం.. కేంద్ర పథకాలకు ఏమాత్రం తక్కువ చేయకుండా రాష్ట్రంలో అమలు జరపడం.. అందుకు అధికార బీజేపీ క్రెడిట్ ను కాపాడటం వంటివి వైసీపీ పకడ్బంధీగా అమలు చేస్తుంది. అంతకుంటే అవినీతి రహతంగా.. అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ.. సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్న వైఎస్ జగన్ కు కేంద్రం అన్ని విధాలుగా సాయం అందిస్తుంది.

తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రానికి, మరోసారి విఙ్ఞప్తి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరం ఎంతో ఉందని, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలని కోరింది. ఈరోజు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వైఎస్సార్‌ సీపీ లేవనెత్తిన తొమ్మిది అంశాలను వివరించింది. అవేమంటే.. ‘రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని.. వెనకబడిన జిల్లాలకు 23 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3,283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని తెలిపింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను ఆమోదించాలని. రాజధాని నగర అభివృద్ధి కోసం గ్రాంట్ గా రూ.47,424 కోట్లు ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని.. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు రిలీజ్ చేయాలని వివరించారు. మొత్తానికి వైసీపీ అవకాశం దొరికిన ప్రతి చోటా ప్రత్యేక హోదా.. నిధుల కోసం కేంద్రాన్ని మర్యాదపూర్వకంగా కోరుతూ ఉండటం విశేషంగా చెప్పవచ్చు.