ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు నేతల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి దారణంగా మారింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తీసుకొనే ప్రతి స్టెప్ ఫెయిలౌతూనే వస్తుంది. ఇక్కడో విషయం చెప్పాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యూటర్న్ బాబుగా చరిత్రకెక్కితే.. అధికారంపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూ టర్న్ లు తీసుకోవడంలో ఏమాత్రం తగ్గడం లేదు. అందులో భాగంగానే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కరకట్టపై కట్టిన అక్రమ కట్టడమైన ప్రజాదర్భార్ ను కూల్చివేయడంలో కూడా లింగమనేనికి సంబంధించిన లావాదేవీలపై యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుక విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇంగ్లీషు మీడియంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం అమరావతి ఒక్కటే రాజధాని అని పోరాడుతూ.. వికేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారు. అయితే వైఎస్ జగన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పరిపాలన కూడా వికేంద్రీకరిస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని మూడు రాజధానులుగా విభజించే తీర్మానాన్ని చేసి ఆ దిశగా అడ్డు వచ్చిన శాసన మండలిని కూడా రద్దు చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు ఈ బాల్ కేంద్రం కోర్టులో పడింది.

ఇదే సమయంలో ఏపీలో పార్టీల మధ్య పోట్లాట నడుస్తోంది. చంద్రబాబు తీవ్రమైన మానసిక వత్తిడికి గురౌతూ శాసన మండలి రద్దుపై అవాకులు చవాకులు పేల్చుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. అంతుకు మరీ దిగివచ్చి వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ.. తుగ్లక్ నిర్ణయమని… ఓసారి… వైఎస్ జగన్ కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గొడవలు అయ్యేవని.. ఆ విషయాలన్నీ రోశయ్య వద్దకుకు.. వైఎస్ఆర్ చెప్పేవారని విలేఖరుల సాక్షిగా చంద్రబాబు వెల్లడించడం వెనుక ఎంతటి ప్రిష్ట్రేషన్ ఉందో అర్థమౌతుంది. అసలు జరుగుతున్న విషయం ఏంటి.. బాబు చిల్లర మాటలు ఏంటి.. అంటూ అంబటి పంచులు విసిరారు.

అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడిన వైసీపీ నేత అంబటి రాంబాబు తమదైన శైలిలో పంచ్ లు పేల్చారు. శాసనసభ రద్దుతో చంద్రబాబుకు పిచ్చి బాగా ముదిరిందని.. ఎన్నికల కోసం ఆరాటపడుతున్నాడని.. ఇప్పుడే గానీ… ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు కూడా గెలిచే అవకాశాలు లేవని బాబుపై మండిపడ్డారు. అసలు మండలి రద్దుపై ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే వైఎస్సార్‌సీపీ తీసుకుందని అంబటి రాంబాబు వివరించారు. ఎన్నికలకు ముందు మండలి రద్దు చేయాలనే ఆలోచన లేదని.. ఎన్నికల తర్వాత అనివార్యమైన పరిస్థితులను టీడీపీ కల్పించిందని చెప్పారు. పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలిచారని.. రాష్ట్రాభివృద్ధి కోసం త్వరితగతిన సీఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన అధికార వికేంద్రీకరణ బిల్లును మండలిలో కావాలనే కుత్సిత రాజకీయాల్లో భాగంగా తిరస్కరించారని మండిపడ్డారు. సభలో తీర్మానం చేసిన బిల్లులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ సభ్యులు వ్యవహరించారని.. దీంతో మండలిని రద్దు చేయాలనే భావనను కల్పించారని వెల్లడించారు. చట్టాలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు అందించాలంటే మండలి అడ్డుగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే.. రాజకీయంగా అ ఆ లు రాని లోకేష్ లాంటి వ్యక్తులు శాసన మండలిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మండలిని దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. శాసనసభలో తీర్మానం తర్వాత మండలి కచ్చితంగా రద్దు అవుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు దిగజారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడటం తగదని అంబటి పంచ్ లు పేల్చేశారు.