ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేసే దిశగా ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోచుకున్న ఇసుకపై కొత్త పాలసీని తీసుకు వచ్చింది. దీంతో మొదట కాస్త ప్రజలకు అసౌకర్యం అనిపించినా తర్వాత కొత్త పాలసీని అమలులోకి రావడంతో ఎటువంటి అవినీతికి తావులేకుండా, ప్రకృతి ఇచ్చిన సంపద ప్రభుత్వానికి భారీ ఆదాయంగా మారింది. ఇదివరకు కొన్ని కోట్ల రూపాయలు నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. ఇలా టీడీపీ హయాంలో భారీగా ఇసుక దోపిడీకి గురై.. నేతలు విచ్చలవిడిగా దోచుకోవడంతో న్యాయస్థానాలు కూడా విస్తుపోయి భారీ జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే.

అలాంటి ఇసుక దోపిడీని పూర్తిగా అరికట్టేందుకు.. ప్రకృతి సందపను నియంత్రించి ప్రజోపయోగం చేశారు. అందులో భాగంగా వైఎస్ జగన్ కొత్త ఇసుక పాలసీని తెచ్చారు. దీంతో ప్రభుత్వానికి భారీస్థాయిలో ఆదాయం వస్తోంది. అయితే ఇదే విషయంపై తాజాగా వైఎస్ జగన్.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు వైఎస్ జగన్.

అదేమంటే.. ఇసుక పాలసీని అమలు చేయడంలో ఎలాంటి అలసత్వం వహించినా ఊరుకొనేది లేదని హెచ్చరించారు సీఎం జగన్‌. ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. చిన్న పొరపాటు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. ఇసుక పాలసీపై సమీక్ష చేసిన సీఎం వైఎస్ జగన్… నూతన ఇసుక విధానం దేశంలోనే రోల్‌మోడల్‌ అని అధికారులకు వివరించారు. మనం తీసుకున్న ఈ విధానం ద్వారా ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు వైఎస్ జగన్‌. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా… ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని అధికారలకు హెచ్చరికలు చేశారు. అలా జరగకుండా కలెక్టర్లు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు వైయస్ జగన్. ఇలాంటి సమయంలో అధికారులు అంతా ప్రభుత్వ నిర్ణయాలు పకడ్బంధీగా అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ అమలులో ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం సమగ్ర సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో రెడీగా ఉండాలని ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీంతో అధికారులంతా వైఎస్ జగన్ నిర్ణయాలకు చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు. దట్ ఈజ్ వైఎస్ జగన్ అంటూ ముసుముసిగా నవ్వుకుంటున్నారు. హ్యాట్సాప్ సార్.