తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విభజనకు గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అండ్..కో.. మరింత అవినీతికూపంలో ముంచేశారు. ప్రతి వ్యవస్థలను అవినీతిలో ముంచేశారు. కోట్ల రూపాయలను అప్పులపాలు చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పెద్దలు అభివృధ్ధిని నిరంతరం అడ్డుకొంటూ వస్తున్నారు. అందులో భాగంగా వికేంద్రీకరణను అడ్డుకున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని అడ్డుకున్నారు. లేని పోని పుకార్లతో ఆటంకవాద శక్తులుగా మారారు. మొన్న సింగపూర్ కంపెనీ పోయిందన్నారు. నిన్న లులూ గ్రూప్ పారిపోయిందన్నారు. ఇప్పుడు కియా మోటార్స్ వెళ్లిపోబోతుందని అని గగ్గోలు పెడుతున్నారు. అందులో భాగంగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి.

ఇప్పడు టీడీపీ అండ్ బ్యాచ్ అందుకున్న కొత్తరాగం ఏమిటంటే.. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడకు తరలిపోతుందని వాపోతుంది. అసలు ఇదెందుకు వచ్చిందంటే.. ఇలా ప్లాన్ జరుగుతుంది అని.. అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ కధనం వెల్లడించింది. అందులో తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని, ఆ సంస్థ కియా ప్లాంట్‌ను రీ లోకేట్ చేసే ఆలోచనలో ఉందని రాయిటర్స్ కధనం వెలువరించడంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. అయితే రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వం తప్పు పట్టింది. ప్రభుత్వ విధానాలు నచ్చక కియా ప్లాంటుని తమిళనాడుకు తరలించబోతున్నారంటూ రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేర్కొన్నారు. కియా మోటార్స్‌పై రాయిటర్స్‌ కథనం పూర్తిగా అవాస్తవమన్న ఆయన కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అసలే అవకాశం కోసం ఆవురావురు మంటూ వేచి చూస్తున్న టీడీపీ అండ్ విపక్ష పార్టీలు తప్పులకోసం వేచి వేచి చూస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కియా మోటార్స్ శకం ఏపీలో ముగిసిందని.. ఏపీలో జరిగిన అనేక పాలసీల మార్పు వలన ఆ కంపెనీ ఏపీ నుంచి తమ ప్లాంట్ ఎత్తేసి తమిళనాడులో ప్రారంభించే ఆలోచన చేసిందంటూ వాపోతున్నారు. అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ లో ఓ స్టోరీని రాయించి ప్రత్యేక కథనాలను అల్లించి ట్రోల్ చేస్తుంది ఏపీ విపక్ష పార్టీలు. ఆ కథనాన్ని ఆశ్రయించుకొని .. కియా ఏపీ నుంచి తరలిపోతోందని అందుకు తగినట్టుగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని గగ్గోలు పెడుతోంది. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని.. ఆ సంస్థ కియా ప్లాంట్‌ను రీ లోకేట్ చేసే ఆలోచనలో ఉందని వచ్చే వారం సెక్రటరీ లెవల్‌ లో సమావేశం జరగనుందని ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ కధనంలో పేర్కొన్నారు. కియా తన అనుబంధ సంస్థ అయిన హుందాయ్ ప్రతినిధులతో ఈ చర్చలు జరుపిన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా హుండాయ్ సంస్థకు తమిళనాడులో భారీ కార్ల ఉత్పాదన ప్లాంట్ ఉంది. దీంతో ఆ సంస్థతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. కియాకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికులకే ఉద్యోగాలు, లాంటి కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయని, రాయితీల విషయంలో వత్తిడి ఎక్కువగా ఉందని, సంస్థ అనుకున్నట్టుగా ఏం జరగడంలేదని, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందడం లేదనే కారణాలతో బిచాణా ఎత్తేయడానికి ప్లాన్ చేసిందని టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున అండ్ పచ్చమీడియాకు వైరల్ సోకినట్లుగా వాపోతుంది. ఇక తీరా ఏపీ ప్రభుత్వం నుంచే సరైన క్లారిటీ రావడంతో ఇంకేం చేస్తాయి పాపం.. గమ్మునుండిపోయాయి. అంతే మరి.. జగన్ ప్రభుత్వమా.. మజాకా..