ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చాలా చకచకా పనులు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యవస్థలన్నింటినీ సమూలంగా మారుస్తూ.. స్వచ్ఛమైన పాలన జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన నడుస్తోంది. అయితే ఇదే సమయంలో ఎన్నో బిల్లులు చట్టాలు, తీర్మానాలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో అధికార పక్షాన్ని ప్రతిపక్షం అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ.. వైఎస్ జగన్ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ.. నిరంతరం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే వైఎస్ జగన్ పాలనపై వైసీపీ నేత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పీవీపీ పారిశ్రామిక రంగం నుంచి టాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేసి జగన్ పాలనను ఎక్కడికక్కడ సద్విమర్శలు చేస్తూ.. జనాల్లో దూసుకుపోతున్నారు. ఈ మధ్య పీవీపీ సినిమాలు, వ్యాపారాలకు కాస్త దూరంగా ఉంటూ సీరియస్‌గా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి తేరుకొని మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ విజయవాడ అభివృద్ధికి తనదైన శైలిలో పార్టీ తరఫున కార్యకర్తలకు సహాయం చేస్తున్నారు. టీడీపీతో పాటూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలపై స్పందిస్తున్నారు. సినిమా నాలెడ్జ్‌ తో కాస్త పంచ్‌లు జోడించి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపుడుతున్నారు.

అయితే తాజాగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై పీవీపీ తనదైన స్టైల్లో స్పందించారు. ‘పెన్షన్ ఇంటికి తెచ్చిచ్చే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపించే ప్రభుత్వం ఇంకొకటి.. మీరే ఎంపిక చేసుకోండి ఆంధ్రులారా.. చంద్రగ్రహణమా లేక జగన్మోహనమా.. జై ఆంధ్రా అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేవిధంగా ఇదే తరహాలో మరో ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అదేమంటే.. కృష్ణా కరకట్టపై రిటైనింగ్ వాల్‌ కోసం రూ.126 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ధన్యవాదాలు జగన్ గారూ.. కృష్ణలంక కరకట్ట వాసుల కల ఎన్నో ఏళ్లుగా నానుతోంది. అందుకు మీ హయాంలో పరిష్కారం లభించినందుకు జయహో జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీవీపీ. అంతటితో ఆగకుండా విజయవాడలోని కృష్ణలంక కరకట్ట వాసుల అందరి తరుపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు అంటూ పీవీపీ వివరించారు.