ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ జగన్ పాలన నడుస్తోంది. వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ ఎన్నో ఎళ్లుగా పరిష్కారం కానీ విషయాలను లైన్ క్లియర్ చేశారు. ముందుగా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. వీకాఫ్ ను తేవడంలో గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా పోలీసు అధికారలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి అధికారాలను పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అనేక శాఖలను ఎంతో వేగంగా ప్రక్షాళన చేస్తూ అద్భుత రీతిలో పరిపాలన సాగిస్తున్నారు.

ముఖ్యంగా ఇసుక విధానంలో కొత్త విధానాన్ని అమలు చేయడం, వివిధ ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ జరపడం, అమరావతిలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించడంలో చాలా చాకచక్యంలో వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి సాగించాలంటే.. మూడు చోట్లా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్ జగన్ భీష్మించుకొని కూర్చున్నారు. అది అమరావతిలోని కొంతమంది రైతులకు నచ్చడం లేదు. ఉద్యమాలు చేస్తున్నాయి. అయినా కానీ..వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం అడ్డువస్తోన్న శాసనమండలినే లేపద్దామని.. అసెంబ్లీలో మండలి బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు. అయితే ఇప్పుడది కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రానికి చిక్కు వచ్చి పడింది.

బీజేపీ వైఎస్ జగన్ తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో వైసీపీకి అనుకూలంగా మండలిరద్దు తీర్మానాన్ని సునాయాసంగా ఓకే చేసి పంపుతుందనేది వైఎస్ జగన్ ధీమా. అదే టెంపోతో జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఏపీలో నిత్యం సంచలనంగా రాజకీయాలు చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాను అనుకున్నది.. అది ప్రజలకు ఉపయోగం కలిగేది ఎంతటిదైనా ఏమాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తగ్గడం లేదు. చివరకు తమతో పెట్టుకున్న వారే దిగివచ్చి ఏదోలా ఆ నిర్ణాయలన్నింటినీ విజయవంతం చేసేందుకు సహకరిస్తున్నారు. నిజానికి మూడు రాజధానులు అనేది పేరుకు మాత్రమే.. రాజధాని ఒక్కటే ఉంటుంది. అన్ని ప్రాంతాలూ డవలప్ కావడంలో భాగంగా అలా పేరు పెట్టారనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ.. ఇక్కడ వైస్ జగన్ ఇదే ట్యాగ్ లైన్ గా తీసుకొని జనామోదాన్ని పొందారు. హ్యాట్సాప్ జగన్ సార్.. మీ గడ్స్… మీ తెగువ.. మీ.. టెంపో.. మీ దూరపు చూపు.. ఎల్లప్పుడు ఏపీ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలవాలని కోరుకుంటోంది.