ఏపీలో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా టీడీపీకి జోకర్ గా మారిన నారా లోకేశ్ రోజు రోజుకీ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. టీడీపీ యువనేత నారా చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకు నారా లోకేష్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లాగా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, పోతుల సునీత.. తదితర నేతల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు. నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లినప్పుడు సంతలో గొర్రెల్లాగా తమ ఎమ్మెల్యేలను కొనిందని జగన్ ఆరోపించారు. ఇప్పుడు ఆయన మాటలనే ప్రస్తావిస్తూ వీరి ఫోటోలను జతచేశారు నారా లోకేష్ బాబు.

అంతటితో ఆగకుండా.. గొర్రెలతోపాటు గొర్రెల డాక్టర్‌నూ కొన్నారంటూ కామెంట్ చేశారు లోకేష్. అలా నారా లోకేశ్ బాబు కామెంట్ చేశారో లేదో వెంటనే అందివచ్చిన అవకాశం చూసుకొని వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. అసలే ఎప్పుడెప్పుడు దొరుకుతారా అంటూ అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్న వంశీ వెంటనే ఘాటైన సెటైర్ విసిరారు. ఈ నారా లోకేశ్ బాబు.. వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటి చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయారు… అంతేకాకుండా ఇప్పుడు మండలి కూడా రద్దు అయింది. దీంతో కావాలని ఆశించిన చోటా పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఉన్న పోస్ట్ శాసన మండలి రద్దు కానుం. దీంతో ఇక లోకేశ్ బాబు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో లోకేష్‌ బాబుకు పిచ్చిపట్టి విపరీతమైన కామెంట్లు చేస్తున్నారని వల్లభనేని వంశీ విమర్శించారు. అంతటితో ఆగకుండా.. గొర్రెలకే కాదు.. పిచ్చికుక్కలకూ తన దగ్గర వైద్యముందని వంశీ ఎటాక్ చేశారు. దీంతో ఇద్దరి అటాక్స్.. కౌంటర్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వీరాభిమానులైతే.. పప్పు సైలెంట్ గా ఉండక కదిలించుకొని తిట్టుంచుకోవడం ఎందుకు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.