టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో యంగ్ హీరో విజయదేవరకొండ సరసన నటిస్తుంది. ఈసినిమాలో రాశిఖన్నా పాత్ర చాలా విభిన్నంగా ఎంతో వైవిధ్యభరితంగా అలరించబోతున్నట్లుగా ఇప్పటికే కుర్రకారుకు కిర్రెక్కించేలా వైరల్ అవుతోన్న ట్రైలర్స్ చూస్తుంటే అర్థమౌతుంది. విజయ్ దేవరకొండకు లవర్ గా నటించిన రాశీ ఖన్నా.. సినిమా టీజర్‌లో బోల్డ్ అండ్ న్యూడ్‌గా కనిపించి కిర్రాక్ పుట్టిస్తోంది. దీంతో కుర్రకారు ఈ సినిమా టీజర్లు లుక్ లు చూసి పిచ్చెక్కిపోతున్నారు. అసలే విజయ్ దేవరకొండ.. అందులోను బొద్దుభామ రాశీఖన్నా.. ఇంక ఏముంది.. బోల్డ్ హీరోతో బరువైన అందాల భామ కలిస్తే.. షాక్ అయిపోతున్నారు యువత. ఇక్కడ ముఖ్యంగా విజయదేవరకొండతో కలిసి లిప్ లాక్‌లు.. బెడ్ రూం సీన్‌లో.. హాలీవుడ్ రేంజ్ రొమాన్స్‌ ని చూపిస్తున్నారని విపరీతమైన టాక్ వినిపిస్తోంది.

అయితే క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలు ఉన్నప్పటికీ రొమాంటిక్ సీన్లతో మాత్రం రాశీ ఖన్నా గుప్పించేస్తున్నట్లు ఇప్పటికే పాపులర్ అయిపోయింది. అర్జున్ రెడ్డి తరహాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు, లిప్ లాక్‌లు ఉండటంతో ఈ టీజర్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ మొదలయ్యాయి. రాశీ ఖన్నాతో బెడ్ రూం సీన్లు, లిప్ లాక్‌లు రెచ్చిపోయి చేయడంతో రాశీ ఫ్యాన్స్ మరీ ఇంత పచ్చిగా బొద్దుభామ అందాలను ఆరబోయటంపై కామెంట్స్ గుప్పిస్తున్నారు నెటిజన్లు.

అదేవిధంగా ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ కాబోతుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా మరింతగా గ్లామర్ డోస్ ను పెంచేసింది. నిన్న మొన్నటి వరకూ కాస్త పద్దతిగానే కనిపించిన ఈ అమ్మడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రభావమో ఏమో తెలియదు గానీ.. అన్ లిమిటెడ్ అందాలు అన్నట్లు ఆరబోసేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ ఫొటోలను షేర్ చేసింది మరింత పిచ్చెక్కించేస్తుంది. అయితే అమ్మడు ఆరబోతపై నెటిజన్ల నుండి ప్రశ్నలు వస్తుండటంతో.. వరల్డ్ ఫేమస్ లవర్‌లోని బెడ్ రూం న్యూడ్ సీన్లపై స్పందించారు రాశీఖన్నా. ఒకటి రెండు సీన్లు బట్టి సినిమాపై ఒక అంచనాకు వచ్చేయడం కరెక్ట్ కాదని.. స్టోరీ డిమాండ్ చేయడంతోనే ఆ సీన్లు చేయాల్సి వచ్చిందని అంటోంది రాశీ. కథాబలం ఉన్న చిత్రాల్లో ఇలాంటి సీన్లు తప్పనిసరిగా అవసరం అవుతాయని కథ డిమాండ్ చేయడంతోనే ఆ సీన్లు చేయాల్సి వచ్చిందని.. యామిని పాత్ర బోల్డ్ కాదని అంటోందీ బోల్డ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా.