ఏపీలో రాజకీయాలు అప్పుడు 2024 దిశగా నడుస్తున్నాయి. ఎవరి ఎత్తులు వాళ్లు.. ఎవరి వ్యూహాలు వాళ్లు పన్నుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నానా ప్రయత్నాలు చేసి.. చివరికి ఏ పార్టీ కూడా టిక్కెట్ ఇవ్వకపోవటంతో.. వైసీపీలో చేరాడు టాలీవుడ్ కమెడియన్ ఆలీ. విశాఖ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ఆలీ భావించాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనసేన.. ఆ తర్వాత వైసీపీ.. ఇలా అన్ని పార్టీలు చుట్టేశాడు. కానీ.. చివరకు జగన్ ను ఆశ్రయించి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు.

అలా ఎంత ట్రై చేసినప్పటికీ.. ఆ సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రం దక్కించుకోలేకపోయాడు. కానీ.. వైసీపీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆలీ.. తాను ఆశించిందేమీ పార్టీ అధిష్టానం నుంచి దక్కించుకోలేకపోతున్నాడు. ఎన్నికలకు ముందు తనతో కలిసి పని చేసిన చాలా మందికి.. ఏదో ఒక రకంగా సహాయం చేసిన జగన్.. ఆలీ విషయంలో అలాంటిదేమీ చేయలేదు. అంటే.. వైసీపీలో 0ఆలీకి కనీస స్థానం కూడా లేకుండా పోయిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే… ఆలీ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టి.. తనను సన్నిహితుడైన జనసేన పార్టీలోకే వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా.. పవన్ కు తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల.. ఆ పార్టీలో ఓ సముచిత స్థానం దక్కించుకోగలననే ధీమాతోనే.. ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అయితే.. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల్లో నుంచి అధికార పార్టీనుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లిన నేతలు చాలా తక్కువ. ఎక్కడైనా సహజంగా నేతలు… ప్రతిపక్షపార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చేందుకు స్కెచ్ లు వేస్తుంటారు. కానీ… అలీ మాత్రం అధికార పార్టీలో ఉండే ఏదో ఒకటి సాధించాలి కానీ… స్నేహితుడు అయినంత మాత్రాన ప్రతిపక్షంలోకి వెళ్లి అలీ ఏం సాధించలేడని సర్వత్రా టాక్ వినిపిస్తుంది. మరి అలీకి స్నేహం కావాలా? అధికారం కావాలా? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లే తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.