టాలీవుడ్ లో ఈ మధ్య అద్భుతం జరిగింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూసిన విజయశాంతి రీఎంట్రీ మహేష్ బాబు సినిమాతో తీరిపోయింది. అయితే అది కేవలం మహేష్ బాబు సినిమా కోసమేనని తెలుస్తోంది. ఇది నిజంగా విజయశాంతి అభిమానులను నిరుత్సాహ పరచడమే అని టాక్ నడుస్తోంది. తాజాగా మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. దాదాపు 13ఏళ్ల తర్వాత తిరిగి ఆమె మేకప్ వేసుకున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్బాస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయశాంతి సినిమాల్లో కంటిన్యూ అవుతారని అభిమానులంతా ఆశపడ్డారు కానీ.. విజయశాంతి ఊహించని షాక్ ఇచ్చారు. ఇక సినిమాల్లో నటిస్తానో లేదో అంటూ ట్వీట్ పెట్టి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేవిధంగా.. అసలు ఆమె ఏమన్నారు అంటే..‘సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని విజయశాంతి ట్వీట్ చేశారు.