ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అదేమంటే.. ఆ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు.. వ్యవస్థలన్నింటనీ.. నాశనం చేయడం.. అస్సలు ప్రతిశాఖ కూడా అవినీతిమయం చేయడం గత సర్కార్ తాలూకూ పాలన. అలా చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూ ఆ దిశగా అన్ని అక్రమాలను సరైన దిశగా మలుస్తూ వైఎస్ జగన్ సర్కార్ పయనిస్తుంది. ప్రజాక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇలా వ్యవస్థన్నింటినీ పునర్నిర్మించుకుంటూ వెళ్తోన్న జగన్ సర్కార్ పై బురద జల్లేందుకు నిరంతరం ట్రై చేస్తుంది ఏపీలోని టీడీపీ. ఆ పార్టీ నేతల విమర్శలకు అంతే రీతిలో చెక్ పెట్టేందుకు ట్రై చేస్తుంది వైసీపీ ప్రభుత్వం.

తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్స్ విసిరారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి తాజాగా విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు గుప్పించారు.

అసలు ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారు అంటే.. కియా మోటార్స్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తారని, అన్నింటికీ తెగబడి పోయారని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పనలు సృష్టించారని పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకొనే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నారని విజయసాయి ఘాటుగా వ్యాఖ్యానించారు.

అదేవిధంగా చంద్రబాబు కుట్రలు ఏస్థాయికి దిగజారాయి అంటే.. ‘బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోందని… నదులన్నీ వెనక్కి ప్రవహస్తున్నాయి అని.. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది… అని.. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్లు నాసా హెచ్చరించింది.. అంటూ వార్తలు కూడా త్వరలో రాయించు ఆ ఎల్లో మీడియాతో ప్రచారం చేయించగల సమర్థుడు అంటూ విజయసాయి రెడ్డి రెచ్చిపోయారు. అలాగే.. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్.’నీకిది సమయం కాదు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

అంతేకాకుండా ఇదే సమయంలో టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబును ఉద్దేశించి మరో భాణాన్ని విడిచారు విజయసాయిరెడ్డి. అదేమంటే.. మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని తెలిపారు. అలాగే.. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాల్సింది పోయి అస్సలు మౌనంగా ఉండిపోవడం.. దేనికి సంకేతం విజయసాయిరెడ్డి వివరించారు. అదేవిధంగా.. ఈ సోదాలపై రెండు రోజులుగా చంద్రబాబుబ నాయుడు కిక్కురు మనకుండా ఉన్నారని… కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని ఐటీ రైడ్స్ నుంచి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్ది ఫైర్ అయ్యారు.