ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అసమగ్ర విషయాలు, ఎన్నాళ్లు నుంచో స్పష్టత రాకుండా పేరుకుపోయిన.. నాన్చుతున్న అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలు సమీపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా అంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ చిత్రపరిశ్రమలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నంది అవార్డ్స్ కార్యక్రమం జరగడం లేదు. అది గతంలో చంద్రబాబు కమిటీ వేసి నంది అవార్డ్స్ ప్రకటించారు. కానీ.. ఆ నంది అవార్డ్స్ ఏకపక్షంగా.. తమకు అనుకూలంగా కొంతమందికి మాత్రమే కమిటీ ఇచ్చిందని వివాదాస్పదం అయింది. అందుకు నిరసనగా నటుడు పోసాని కృష్ణమురళికి తనకు వచ్చిన నంది అవార్డ్ ను తీసుకోనని బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనకు వచ్చినప్పటికీ.. జరిగిన కమిటీ తీసుకున్న నిర్ణయాలు హర్షించేలా లేవని తేల్చి చెప్పారు. దీంతో అక్కడితో కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ జరిపి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ఆ సమయంలో వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి వాటిపై వెంటనే నిర్ణయం తీసుకోమని కోరారు.

అయితే అందులో భాగంగా మళ్లీ వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఫిబ్రవరి 6న సీయం వైయస్ జగన్ గారితో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ సమావేశంలో మెగాస్టార్ ముఖ్యంగా నంది అవార్డులపై చర్చించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఇదే నిజమైతే త్వరలో వైయస్ జగన్ చేతుల మీదుగా నంది అవార్డ్స్ బహుకరణ ఉంటుందన్న మాట.

కాగా తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తాడేపల్లిలోని జగన్ నివాసంలో చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ జగన్ దంపతులు వారిని ఘనంగా సన్మానించారు. ఆసమయంలో చిరంజీవి జగన్ ఇంటికి చేరుకొని సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. వైఎస్ జగన్ ను కలిసిన మెగాస్టార్ సైరా సినిమా చూడాలని.. కోరడమే కాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. అప్పుడు జగన్ మీకు ఏం కావాలో చెప్పండి అన్నీ పరిష్కరిద్దామని చెప్పారు. దీంతో ఇప్పుడు వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.