సినిమా అంటే అదో రంగుల ప్రపంచం. అందులో ఎంటర్ కావడమే కానీ.. బయటపడటం అంటూ ఉండదు. కొంతమందికి అదో డ్రగ్. ఓ వ్యసనం. అందులోనే అందమైన మధురానుభూతులు. ఎన్నో ఆనందాలు.. అందాలు.. సంతోషాలు.. సుఖాలు. ఎన్ని ఉన్నా ఎక్కువకాలం సినిమాల్లో మనకలగాలి అంటే క్రియేటివిటీ.. అనేది తప్పని సరి. నిత్యం ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుండాలి. ప్రదర్శిస్తుండాలి. అదంతే..

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ హీరో అంటే చాలా మందే ఉన్నారు. ‘డార్లింగ్’ ప్రభాస్ నుండీ రానా, వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్ ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్ళంతా ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. హీరోలతో పోలిస్తే మేమేమి తక్కువ కాదు అంటూ హీరోయిన్లు కూడా 3 పదుల వయసు వచ్చినా.. పెళ్ళిళ్ళు చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్ళి చేసుకుంటే ఆఫర్లు తగ్గిపోతాయి అని భయపడుతున్నారో ఏమో కానీ.. కొంతమంది భామలు అస్సలు పెళ్ళి చేసుకోవట్లేదు. అలా 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్న హీరోయిన్లను ఎవరెవరో ఓ లుక్కేద్దాం.. రెడీనా..

1. అనుష్క శెట్టి : ‘సూపర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మన స్వీటీ ఇప్పటి వరకూ పెళ్ళిచేసుకోలేదు. ‘ప్రభాస్ తో లవ్ లో ఉంది’ అంటూ వార్తలు వస్తున్నా ‘అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పారేస్తూ వస్తుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన మన స్వీటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
2. త్రిష కృష్ణన్ : తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న వారిలో త్రిష కూడా ఒకరు. ఇప్పటికి ’96’ వంటి సూపర్ హిట్లతో అలరిస్తూనే ఉన్న త్రిష.. 30 దాటినప్పటికీ పెళ్ళిచేసుకోలేదు.
3. నయన తార : తమిళ్తో పాటు తెలుగులో కూడా నయన తార స్టార్ హీరోయిన్ గా కొనసాతుంది. ఈమె చిన్న సినిమా చేసినా.. స్టార్ హీరో సినిమా చేసినా రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. ‘గ్యాంగ్’ ఫేమ్ విగ్నేష్ శివన్ తో డీప్ లవ్ లో ఉంది. త్వరలో పెళ్ళిచేసుకుంటాను అని చెప్తున్నారు కానీ.. ఇంకా చేసుకోలేదు.
4. శృతి హాసన్ : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది శృతి హాసన్. ఈమె మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 30 ఏళ్ళు దాటినా ఈమె ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం విశేషం.
5. కాజల్ అగర్వాల్ : కాజల్ కూడా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తన చెల్లి నిషా అగర్వాల్ పెళ్ళి చేసుకున్నా.. ఇంకా కాజల్ మాత్రం పెళ్ళిచేసుకోలేదు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్ళెందుకు అని అనుకుంటుందో ఏమో..!
6. తమన్నా : ‘శ్రీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పటికీ క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. హిట్లు ఎక్కువ లేకపోయినా అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోలందరి సరసన నటించేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈమె కూడా 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళికి నో అంటుంది.
7. ఇలియానా : ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. ఇప్పటికీ బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టు లు చేస్తూ బిజీగా గడుపుతుంది. 32 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి పెళ్ళి చేసుకోలేదు ఈ భామ.
8. తాప్సి పన్ను : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది తాప్సి. కానీ తెలుగు కంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 32 ఏళ్ళు వచ్చినా.. ఈ అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
9. నిత్యా మేనన్ : ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మరో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ‘నిత్యా మేనన్’. సౌత్ లోనే కాకుండా ‘మిషన్ మంగళ్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్న నిత్యా మేనన్.. 31 సంవత్సరాల వయసొచ్చినా పెళ్ళి చేసుకోలేదు.
10. ఛార్మీ : మల్టీ టాలెంటడ్ గర్ల్ అని చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ఛార్మీ ఒకరు. మొదట్లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన ఛార్మీ ఇప్పుడు నిర్మాతగా మారి తన స్నేహితుడు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసే సినిమాలను నిర్మిస్తుంది. 32 ఏళ్ళు వచ్చినప్పటికీ ఈ బ్యూటీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
11. కృతి కర్బంద : పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’, రామ్ తో ‘ఒంగోలు గిత్త’ వంటి చిత్రాల్లో నటించిన కృతి కర్బంద… 30 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం.
12. అంజలి : ‘ఫోటో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది తెలుగమ్మాయి అంజలి. 33 ఏళ్ళు వచ్చినా ఈ అమ్మడు పెళ్ళి చేసుకోలేదు. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
13. రిచా గంగోపాధ్యాయ్ : ‘లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రిచా.. ఆ తరువాత ‘మిరపకాయ్’ ‘మిర్చి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఈమె కూడా 33 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్ళిచేసుకోలేదు.
14. రాయ్ లక్ష్మీ : ‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ రాయ్. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇది పక్కన పెడితే.. 30 ఏళ్ల వయసు వచ్చినా ఈ అమ్మడు పెళ్ళిచేసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.
15. హెబ్బా పటేల్ : ‘అలా ఎలా’ వంటి ఎంట్రీ ఇచ్చిన ఈ హెబ్బా పటేల్.. ఆ తరువాత ‘కుమారి 21f’ ‘ఈడోరకం ఆడోరకం’ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ళ వయసు వచ్చినా ఈ అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
16. ఇషా చావ్లా : ‘ప్రేమ కావాలి’ ‘పూలరంగడు’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఇషా చావ్లా కూడా 31 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోలేదు. ఇంకా మరెందరో హీరోయిన్లు మూడు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు అంటే సినిమా అవకాశాలు తగ్గుతాయనే భయం వీరిని పీడిస్తుంది కాబోలు.