అతి తక్కువ కాలంలోనే అత్యంత ఆదరణ పొందింది హీరోయిన్ రష్మిక. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే కన్నడ బ్యూటీ అయిన ఈమె ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆఈ తర్వాత రష్మిక ఖాతాలో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరయిన్ గా సెలక్ట్ అయ్యింది.

అదేవిదంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా రష్మిక నటిస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కన్నడ భామ మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకుందని తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసారని సమాచారం అందుతుంది. ఇప్పటికే సుల్తాన్ సినిమాలో అక్కడ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇందులో కార్తీ సరసన రొమాన్స్ చేస్తుంది. అయితే సూర్య తాజాగా సింగం ప్రాంచైజీ ను తెరకెక్కించిన డైరెక్టర్ హరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక కు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సింగం ప్రాంచైజీలో నాలుగో చిత్రమా? లేక స్పెషల్ మూవీనా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ.. ఈ కన్నడ భామ రష్మిక ఇటు తెలుగులోనూ అటు తమిళ్ లోను అవకాశాలు దక్కించుకుంటూ మంచి ఫామ్ లో కొనసాగుతుండటం విశేషంగా చెప్పవచ్చు.