ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో రాయలసీమ ప్రత్యేకమైంది. ఇదే ప్రాంతం నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు ప్రజాసేవ చేశారు. రాజకీయాల్లో రాణించారు. ప్రస్తుతం ఇదే ప్రాంతం నుంచి రాయలసీమ తూటాగా.. యువతేజం.. రాయలసీమ పొలిటికల్ ఐకాన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనూహ్యంగా ప్రజల్లోకి విచ్చేశారు. తలపండిన రాజకీయవేత్తగా ఆయన మాటలు తూటాల్లా ప్రజల్లో చొచ్చుకుపోతున్నాయి. రాజకీయాలతో కబడ్డీ ఆడుకుంటున్న ఆయన సగటు రాజకీయ నాయకుడుగా కాకుండా దూసుకుపోయే పదునైన భావాలతో నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆకర్షవమంతమైన ఆయన మాటతీరుకు యూత్ వెంటపడుతుంది. రాయలసీమ జనం ఫిదా అవుతోంది. రాజకీయాలు అంటే నచ్చని వారు కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతుంటే అల్లా చూస్తూ ఉండిపోతున్నారు. వయసు చిన్నదే అయినప్పటికీ ఆయన ఆశయాలను, ప్రగతిశీలమైన ఆయన భావాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. రెండు పదుల వయసులోనే పదునైన కోర చూపు… తూటాల్లాంటి మాటలతో రాజకీయాలను చదివేసిన లోకజ్ఞానిగా యూత్ కి బైరెడ్డి దర్శనమిస్తున్నాడు. అలా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అంతకంటే.. రాయలసీమలో అందులోను.. కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. సంచలనం రేపాలా చేస్తోన్న ఆయన పొలిటికల్ స్టైల్ జనాన్ని కట్టి పడేస్తుంది. అసలు ఎవరీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే.. వీరిది రాయలసీమ రాజకీయాల్లో పేరొందిన కుటుంబం. సిద్ధార్థ్ రెడ్డి తాత శేషశయన రెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. అలాగే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. సిద్ధార్థ్ రెడ్డికి పెదనాన్న. ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు. అదే తర్వాత పార్టీగా మారింది. సీమ అంటే రోషం.. పౌరషం. నచ్చిన వారికోసం ఎంతవరకైనా వెళ్లే నైజం. నచ్చని వాటిని సహించలేని తనం. అలాంటిది రాజకీయాల్లో పెదనాన్న చేష్టలు నచ్చక సిద్ధార్థ్ రెడ్డి గౌరవంగా బయటకు వచ్చి వైసీపీలో చేరారు.

అదేవిధంగా ఇక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తల్లిదండ్రులు బైరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఉషారాణి. ఇతడి బాల్యమంతా కడప జిల్లాలోనే సాగింది. దూరవిద్య ద్వారా బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన సిద్ధార్థ్ రెడ్డి.. చిన్నప్పటి తన జీవితం చాలా చురుకుగా గడిచిందంటారు. హైదరాబాద్ సీబీఐటీలో ఇంజనీరింగ్ చేరి మధ్యలో విడిచిపెట్టారు. చిన్నప్పటి నుంచే సిద్ధార్థ్ రెడ్డికి విప్లవ భావాలు.. సమాజం.. ప్రజలు.. సేవ వంటివి వారసత్వంగా అబ్బాయి. అలా రాజకీయాలపై ఆసక్తిని పెంచుకొని అతి తక్కువ సమయంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. నేతలకు చుక్కులు చూపుతున్నారు. తాజాగా జరిగిన నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా అద్భుతంగా పనిచేసి 40వేలకు పైగా ఓట్ల మెజారిటీతో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ ను గెలిపించి వార్తల్లో కెక్కాడు. అలా మాటలతోనే కాకుండా తన వ్యూహ ప్రతివ్యూహాలతో స్థానికంగా తలపండిన నేతలను కూడా మట్టికరిపించాడు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కూడా సిద్ధార్థ్ రెడ్డి పనితీరును గుర్తించి.. ఈ యువకుడిని తాను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని.. మంచి భవిష్యత్తును ఇస్తానని.. మాటచ్చాడు కూడా.

అంతేకాకుండా అసలు అంత చిన్న వయస్సులోనే సిద్ధార్థ్ రెడ్డిని ఇంతగా రగిలించిన అంశాలేంటి? అంటే చాలా ఉన్నాయి. 19ఏళ్ల వయస్సులో పెదనాన్న అనుచరుడుగా రంగంలోకి దిగిన సిద్ధార్థ్ రెడ్డి అనతి కాలంలోనే ఆయన దూరమయ్యాడు. అందుకు అబ్బాయి దూకుడును పెదనాన్న తట్టుకోలేకపోవడమే కారణం. తర్వాత ప్రజలకోసం సిద్ధార్థ్ రెడ్డి సొంతంగా రాజకీయాలు చేయడం మొదలెట్టాడు. ముఖ్యంగా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హత్యకేసులో తాత, పెదనాన్నతో పాటి సిద్ధార్థ్ రెడ్డి కూడా 70రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అప్పుడే అధికారం కావాలని… ప్రజలకోసం బ్రతకాలని డిసైడ్ అయ్యారు సిద్ధార్థ్ రెడ్డి. శత్రువులు రెచ్చగొట్టడం… కుళ్లు రాజకీయాలు.. సిద్ధార్థ్ రెడ్డిలో ఆవేశాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఇంత చిన్న వయస్సులోనే బైరెడ్డి మరీ అంత దూకుడుగా వెళ్తుండటంతో.. ఇప్పటికే ఆ ప్రాంతంలోని తలపండిన రాజనీతిజ్ఞులకు నచ్చని విషయం. దీంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రజలను.. నాయకులను కలుపుకుంటూ పోతూ.. ప్రజాసేవే ప్రధానంగా.. శత్రువులను పెంచుకోకుండా అందరివాడుగా శక్తిమంతుడుగా ముందుకు వెళ్తే భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ముందు ముందు ప్రజాసేవలో మరింతగా రాణించాలని.. హోదాలు.. గొప్ప పదవులు అధిరోహించాలని.. సిద్ధార్థ్ రెడ్డి ప్రజలు విడిచిన బాణంగా రాజకీయాలు చేయాలని కోరుకుంటుంది