ప్రస్తుతం ప్రపంచాన్ని బీభత్సంగా వణికిస్తోంది కరోణా వైరస్. వేలాది మంది పాలిట మృత్యువుగా మారింది. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ పేరుతో ఓ మహిళకు మేలు జరిగింది. అదెలాగంటే.. రేపిస్ట్ ల నుంచి ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. కరోనా వైరస్ సోకిన మనుషులు ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతుంటే.. ఓ మహిళ మాత్రం తన మానాన్ని కాపాడుకుంది.

వివరాలు చూద్దాం.. చైనాలోని వూహాన్‌కు 3గంటల ప్రయాణంలో ఉన్న జింగ్‌షాన్‌ అనే ప్రాంతంలో ఒంటరిగా ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమె ఇంట్లోకి జియావో అనే వ్యక్తి చొరబడి అత్యాచారం చెయ్యడానికి ట్రై చేశాడు. అదే సమయంలో ఆమె తెలివిగా కరోనా వైరస్ పేరును ఉపయోగించింది. అతడి ముఖంపై దగ్గి.. తాను వూహాన్‌ నుంచి వచ్చానని.. తనకు కరోనా వైరస్ సోకిందని తెలిపింది. అంతే ఆమెను రేప్ చేసేందుకు అతడు సాహసించలేదు. వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే అతడు పోతూపోతూ.. ఆమె ఇంట్లోంచి 3080 యువాన్లు (అంటే ఇండియన్ కరెన్సీలో రూ.30 వేలు) పట్టుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా.. నిజం వెలుగులోకి వచ్చిందిగానీ.. జియావోను మాత్రం పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న అతను కరోనా నిజంగానే సోకిందేమో అనే భయంలో తన తండ్రితో సహా వచ్చి పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు.

అయితే కరోనా మహమ్మారిలా ప్రపంచాన్ని బయపెడుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా వైరస్ తో చైనాలో ఇప్పటివరకు 492మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ ప్రసిద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా కరోనా సోకకుండా ఓ మంత్రాన్ని వేస్తున్నాడు. చైనాలోని లక్షలాది మంది దలైలామాను దేవుడిగా పూజిస్తారు. వారంతా ఇప్పుడు ప్రమాదంలో ఉండటంతో వారిని కాపాడేందుకు దలైలామా ఒక మంత్రాన్ని చెప్తున్నారు. ఎవరైతే తారా మంత్రంను జపిస్తారో వారికి కరోనా వైరస్‌ అంటదు అని వెల్లడించారు. కరోనా వైరస్‌ నుండి కాపాడుకొనేందుకు ‘ఓం తారే తుత్తారే సోహా’ అనే మంత్రాన్ని జపించాలంటూ స్వయంగా దలైలామా ఆ మంత్రాన్ని జపించి జనాలకు వినిపించారు. దీంతో ప్రస్తుతం ఈ మంత్రం చైనా అంతటా మారు మ్రోగిపోతుందట.