ఓ చల్లని సాయంత్రం. హైదరాబాద్ నడిబొడ్డు. చంద్రబాబు గారు కట్టుకున్న ఇంద్రభవనం. టీడీపీ సీనియర్ నేతలు వారసులతో చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇచ్చిన విందుకు టీడీపీ నేతల వారసులు హాజరయ్యారు. విందు ఆరగించారు, డాన్స్‌లు కూడా చేశారట..!. చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి బ్రాహ్మణితో ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కాసేపటికే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలకు కౌంటర్‌గా కామెంట్లు వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు పెట్ఠాలి. వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్ మీడియా సైన్యం స్పందించాలి. కాని..ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైన్యం విందు ఫోటోలను అసలు పట్టించుకోలేదు. చూసిచూడనట్లు వదిలేశారు. టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సైకిల్ పార్టీ వారు ఊహించని విధంగా స్పందించారు. లోకేష్ ఇచ్చిన విందుపై దుమ్మెత్తి పోశారు. కష్టపడేది ఒకరు విందులు, వినోదాలు మరొకరికా అంటూ మండిపడ్డారు. “లోకేష్‌ విందుకు పిలిచిన వారిలో ఒక్కరికైనా ప్రజల్లో తిరిగిన అనుభవం ఉందా..?” ఓ టీడీపీ కార్యకర్త ఆవేశంగానే సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. “ఇది మేకప్‌ల విందు”అంటూ మరో కార్యకర్త కామెంట్ చేశాడు. “టీడీపీ నేతలకు వారసులు కావడమే విందుకు అర్హతా..?”అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మరో టీడీపీ కార్యకర్త ప్రశ్నించారు. ఇలా అనేక రకాలు కామెంట్లతో లోకేష్ ఇచ్చిన విందుపై విరుచుకుపడ్డారు టీడీపీ కార్యకర్తలు. “కష్టపడేది మేమూ, విందులు వారికా ..?” అంటూ ఓ మహిళా టీడీపీ కార్యకర్త కామెంట్ పెట్టింది. దీంతో..లోకేష్‌ ఏదో చేయబోతే మరేదో అయిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

లోకేష్ విందు ఎందుకిచ్చారు..? ఏం ఆశించి టీడీపీ నేతల వారసులను పిలిచాడు..?

ఏపీలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వైఎస్‌ జగన్‌ దూకుడుతో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకే చెమటలు పడుతున్నాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. బీసీలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని దేవుడ్నిచూసినట్లు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్‌ నాయకత్వ, పాలనా పటిమపై చర్చ జరుగుతోంది. ఎల్లో మీడియా చంద్రబాబును ఎన్ని జాకీలు వేసి లేపాలని చూసినా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు బై చెప్పారు. ఇద్దరూ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం. అవినీతి మరక లేకుండా సీఎం వైఎస్ జగన్‌ పాలన కొనసాగుతోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో పరిపాలనా సంస్కరణలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తెరలేపారు. విద్యా సంస్కరణలతో పేదలు సంతోషంగా ఉన్నారు. గ్రామస్థాయి టీడీపీ కార్యకర్తలు, జిల్లా స్థాయి నేతలు వైఎస్ఆర్‌ సీపీ వైపు చూస్తున్నారు. క్యాడర్ జారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలి..? అనే ప్రశ్న నుంచి పుట్టిందే విందు రాజకీయం. అయితే..లోకేష్‌ ధనవంతులు బిడ్డలను మాత్రమే విందుకు పిలిచాడు. ఏనాడు ప్రజలతో సంబంధాల్లేని వారిని విందుకు ఆహ్వానించారు. విందుకు పిలిచినవారిలో 95 శాతం మంది సోషల్ మీడియాలో ఉండరు. ప్రజల్లో అసలే ఉండరు. వ్యాపారాలు చూసుకుంటూ ఆస్తులు పెంచుకునే పనిలో బిజీగా ఉంటారు. ఇటువంటి వారిని సెలక్ట చేసుకుని విందుకు పిలవడంతో లోకేష్ పై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. లోకేష్ ఆలోచనతో పార్టీ ముందుకు పోతే ఒక్కరూ కూడా ఉండరని సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీకి లోకేషే పెద్ద మైనస్‌ అంటూ కూడా కామెంట్ చేశారు. “సోషల్ మీడియాలో, జనాల్లో వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కావాల్సింది వారసత్వం కాదని, చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలు” అంటూ లోకేష్‌కు సెగ తగిలేలా చురకలు అంటించారు టీడీపీ కార్యకర్తలు.

సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌ సీపీని ఎలా ఎదుర్కోవాలి , క్యాడర్‌ చేజారి పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వారసులతో లోకేష్ చర్చించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే…టీడీపీ అగ్ర నాయకత్వంపై క్యాడర్‌ చాలా కోపంగా ఉన్నట్లు వారసులు లోకేష్ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని వారసులతో లోకేష్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే…గ్రామీణ స్థాయిలో వైఎస్ జగన్ ప్రవేశ పెడుతున్న పథకాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాయని వాలంటీర్లు వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానికి వెన్నుముకలా మారుతున్నారని వారసులు విందులో చిందేస్తూ చెప్పినట్లు సమాచారం. అయితే..వాలంటీర్ల వ్యవస్థపై ఎదురుదాడి చేయాలని వారసులకు లోకేష్ సూచించినట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే..విందు ముగిసిన తరువాత లోకేష్ “వాలంటీర్లు రేపిస్ట్‌లు, దండుపాళ్యం బ్యాచ్ “అంటూ ట్విటర్‌లో కామెంట్లు చేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ట్విటర్‌లో లోకేష్ చేసిన కామెంట్లపై టీడీపీ అధికార ప్రతినిధులు, సానుభూతి పరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలోని జన్మభూమి కమిటీల కంటే కూడా వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోని వాలంటీర్ల వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుందని టీడీపీ సానుభూతి పరులు నాకు ఫోన్‌లు చేసి చెప్పిన సందర్భాలున్నాయి. లోకేష్ మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని అది టీడీపీకి నష్టం కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. పుత్రుడి మీద ప్రేమతో చంద్రబాబు లోకేష్‌ను నెత్తిన పెట్టుకుంటే టీడీపీ పుట్టి మునగడం ఖాయమని వాపోతు న్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడని ఆయనను ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదని కూడా టీడీపీ నేతలు నాతో చెప్పారు. చంద్రబాబు ఆయన కుమారుడు ఎల్లో మీడియానే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని, జగన్‌ మాత్రం ప్రజలను నమ్ముకుని, ప్రజాసేవకుడిగా ముందుకు వెళ్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ నేత నాతో మాట్లాడుతూ చెప్పారు.

చెప్పింది చెప్పినట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసుకుపోతుంటే అబద్దపు ప్రచారాన్నే చంద్రబాబు ఆయన కుమారుడు నమ్ముకోవడంపై కూడా టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌ ఇద్దరూ ఇంకా కోటరీ మాటలనే వింటున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. అమరావతి చుట్టూ తిరుగుతూ రాయలసీమ, ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నామని పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనంటున్నారు. విందులు, డాన్స్‌లతో పార్టీ మనుగడ ఉండదని ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. విశాఖ ఘటన చంద్రబాబు కోరి తెచ్చుకున్నదేనని..భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇవన్నీ విందు భేటీలో మాట్లాడకుండా తిని, నాలుగు స్పెప్పులేసి, సెల్ఫీలు దిగి, ఫొటోలకు పోజులిస్తే భవిష్యత్తు పరిణామాలకు బాధ్యత వహించాల్సింది లోకేషేనని టీడీపీలో ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి లోకేష్ – బ్రాహ్మణిలు ఇచ్చిన విందు ఫలితాలు రాబట్టకపోగా టీడీపీలో అంతర్గతంగా వివాదాస్పదమైంది. కొరివి కాల్చి వాత పెట్టినట్లు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో లోకేష్ మీద కామెంట్లు పెట్టారు. వైఎస్‌ఆర్‌ సీపీని ఎదుర్కోవడం ఎలా అనే విందుతో ఇప్పుడు లోకేష్‌ తమ కార్యకర్తలను ఎదుర్కోవడం ఎలా అనే డైలామాలో పడినట్లు తెలుస్తోంది. కోతిని చేయబోతే కొండముచ్చు అయిందంటారు అచ్చం అలా అయింది లోకేష్ విందు