ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టి ఎనిమిది నెలలు అయింది. ఈ ఎనిమిది నెలల్లో ఎన్నో పథకాలకు.. చట్టాలకు శ్రీకారం చుట్టి ఆచరణాత్మకంగా పకడ్బంధీతో కూడిన నిర్మాణంతో అమలు చేస్తూ పాలనాపరంగా రారాజుగా దూసుకుపోతున్నారు. అధికార పగ్గాలను చేపట్టిన అతి తక్కువ సమయంలోనే అత్యంత ఘననీయమైన పాలనతో జనమంతా హర్షించేలా వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడంలో.. సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో.. శాంతి భద్రతలను పరిరక్షించడంలో గతంలో ఎన్నడూలేని విధంగా అత్యంత పారదర్శకంగా.. అవినీతి రహితంగా ఓ విప్లవాన్ని సృష్టిస్తున్నారు.

విద్యలో వైవిధ్యభరితమైన మార్పులు, వైద్యంలో పేద ప్రజలకు భరోసా, రైతులోకంలో విప్లవాత్మకమైన చైతన్యం, పేద, బడుగు బలహీన వర్గాల ముఖాల్లో చిరునవ్వు, సంక్షేమంలో ప్రతి సామాజిక వర్గానికి వారి వారి స్థితిగతులను మెరుగుపరిచేలా చేయూత ఇలాంటి ఎన్నో పథకాలను ఆచరిస్తూ.. చరిత్రను సృష్టించారు. అనతి కాలంలోనే అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. ఓ హిస్టరీని క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఓ డైనమిక్ ముఖ్యమంత్రికి ఆణిముత్యాల్లాంటి నవరత్నాలు.. అంటే కేబినేట్ లో ఆయన బృందం ఓ మిషన్ లా పని చేస్తున్నారు.

సహజంగా ప్రజా నాయకులు స్వయంప్రకాశ శక్తులు. అలాంటి వారే ప్రజల్లో రాణిస్తారు. ప్రజా నాయకులుగా ఎదుగుతారు. అలాంటి వారికి ప్రజానేత అయిన వారి అధినాయకుడి బలం తోడైతే ఇక ఆ నాయకులకు తిరుగుండదు. అందుకోసం అవకాశం రావాలి. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అలా అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించికుంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని శక్తివంతమైన మంత్రులుగా వెలుగొందుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినేట్ లోని ఈ నవరత్నాల్లాంటి తొమ్మిదిమంది మంత్రులు.

వారే.. ఓ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఓ కొడాలి నాని, ఓ పేర్ని నాని, ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఓ కురసాల కన్నబాబు, ఓ అనిల్ కుమార్ యాదవ్, ఓ ఆదిమూలపు సురేష్, ఓ బొత్స సత్యనారాయణ, ఓ పుష్పశ్రీవాణి. వీరంతా వైఎస్ జగన్ కేబినేట్ లోని శక్తిమంతులైన మంత్రులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్లపాటు పడరాని పాట్లు పడ్డారు. తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా అకాల మరణంతో ప్రజల్లో అమరుడయ్యాడు. వైఎస్ఆర్ ఓ దేవుడయ్యాడు. మహానేత అయిన ఆ దేవుడి మరణాన్ని తట్టుకోలేక వందలమంది మరణించారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. జనాల్లో వైఎస్ జగన్ కు పెరుగుతున్న ఆదరణ, శక్తిని గమనించిన ఢిల్లీ పెద్దలు గల్లీ లీడర్లతో వైఎస్ జగన్ పై కేసులు పెట్టించారు. తన మాట వినమని ప్రజల్లోకి వెళ్లవద్దని వైఎస్ జగన్ ను నిలువరించే ప్రయత్నం చేశారు. తండ్రి మరణంతో రోడ్డున పడ్డ కుటుంబాల కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లారు. తమ మాట లెక్కచేయని వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ సీబీఐ, ఈడీలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపింది. కేసులను పెట్టి 16నెలల పాటు జైళ్లో పెట్టింది. అయినా మొక్కవోని సంకల్పంతో ప్రజలకోసం నిరంతరం తపిస్తూ.. తమను నమ్ముకున్న ప్రజలకోసం ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాడాడు. వైఎస్ జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. వెంటనే 2014లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు టీడీపీ.. కాంగ్రెస్, బీజేపీ అన్ని కూడా వైఎస్ జగన్ ను దొంగగా చిత్రీకరించి అనుభవం అనే ట్యాగ్ తో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా వైఎస్ జగన్ నానా రకాలుగా టీడీపీ నేతలు దూర్భాషలాడారు. డైరెక్ట్ గా దొంగ దొంగ అంటూ వేధించారు. అప్పుడే అసలైన ప్రజా నేతల్లో మేమున్నాం అంటూ వైఎస్ జగన్ కు అండగా నిలిచారు ఏపీ ప్రజలు. వైసీపీ నేతలు. అలా ఐదేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజాక్షేత్రంలోంచి పోరాడి 175 అసెంబ్లీ సీట్లకు గాను.. 151 సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఓ చరిత్ర.

గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. చట్టాలను గౌరవిస్తూ.. రిజర్వేషన్లు పాటిస్తూ.. తన కేబినేట్ కూర్పులోనే చరిత్రను సృష్టించి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అక్కడ నుంచి అన్ని వ్యవస్థలను పక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం సరైన టీంను జగన్ ఎంచుకున్నారు. అంతటితో ఆగకుండా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతా ఉద్దండులు.. ఆయా రంగాలలో ప్రావీణ్యం.. అధికారం… పట్టు ఉన్నవారే. అయితే వారిలో కొంతమంది స్వయంప్రకాశ శక్తులు. మరికొంత మంది అందిన అవకాశంతో.. స్వేచ్చను సరిగ్గా ఉపయోగించుకొని రాణిస్తున్నవారు.

ముఖ్యంగా మంచిగా చదువుకొని.. ఉన్నత కుటుంబంలో పుట్టి.. గ్రామ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ.. ప్రజాక్షేత్రంలో ఆర్థిక మంత్రిగా రాణిస్తున్నారు బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి. లెక్కలతో ప్రత్యర్ధుల గుండెలను హడలెత్తిస్తూ.. గత ప్రభుత్వం చేసిన దారుణాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. విలక్షణంగా దూసుకెళ్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలకు సరిగ్గా జబ్డెట్ అమలు చేస్తూఅభివృద్ధికి సహకరిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ ఇచ్చిన స్వేచ్ఛతో ప్రతి రంగంలోను చిట్టాపద్దులతో సహా చరిత్రను అలవోకగా వెల్లడిస్తూ.. వర్తమానానికి మార్గనిర్ధేశం చేస్తూ.. భవిష్యత్తు నాయకులకు రోల్ మోడగ్ గా నిలిచారు ప్రముఖ దిగ్దర్శకుడైన కేవీరెడ్డిగారి మనవడు అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

అలాగే కొడాలి నాని. పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న మాస్ లీడర్. ప్రతిపక్షాన్ని అలవోకగా ఆటలాడుకుంటాడు. అన్ని సమయాల్లోనూ వైఎస్ జగన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ.. తలలో నాలుకలా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తూ.. ప్రజల్లో విలక్షణంగా దూసుకుపోతున్నారు.

అలాగే.. పేర్ని నాని.. రవాణా శాఖా మంత్రిగా చాలా అద్బుతంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ప్రముక పాత్ర పోషించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఎంతో గొప్ప హోం వర్క్ చేశారు పేర్ని నాని. అలాగే.. ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో చాలా విలక్షణంగా హుందాగా వ్యవహరిస్తూ జగన్ పై ఈగ వాలనీయకుండా.. రాష్ట్ర ప్రజల హృదయాలను గెలిచారు. కృష్ణా జిల్లా నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వైఎస్ జగన్ గారి వద్ద మంచి సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు.

అదేవిధంగా కురసాల కన్నాబాబు వ్యవసాయ శాఖా మంత్రి. జర్నలిస్ట్ గా చేసిన ఓ వ్యక్తి అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా తక్కువ సమయంలోనే వైవిధ్యభరితమైన రాజకీయ నేతగా.. ప్రజానురంజకంగా పాలన అందిస్తున్నారు. చరిత్రలో ఏ రాష్ట్రం చేయనంతగా ఏపీ రైతులకు భరోసాను కల్పిస్తూ డబ్బులు ఇవ్వడం నిజంగా హర్షించదగిన పరిణామం. ఇది వైఎస్ఆర్సీపీకి ఆయువుగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్నబాబుకు ప్రత్యర్థ పార్టీ నేతలు ఎదురుదాడితో ఎన్నికల్లో గుర్తింపు పొంది ఆ తర్వాత సరైన కేబినేట్ ర్యాంక్ అందుకొని విలక్షణంగా దూసుకుపోతున్నారు.

అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్ శాఖామంత్రి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమికను పోషించారు పెద్దిరెడ్డి. ఆ తర్వాత వైఎస్ జగన్ మానసపుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, సుమారు నాలుగున్నర లక్షలమందికి ఏకకాలంలో ఉద్యోగావకాశాలను కల్పించడం, ఆచరణాత్మకంగా సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజంగా వైఎస్ జగన్ కేబినేట్ లో అతి ముఖ్యమైన ఇద్దరిలో పెద్దిరెడ్డిగారిని ఒకరిగా చెప్పవచ్చు. అంతటి అదృష్టాన్ని.. హోదాను.. స్థాయిని పెద్దిరెడ్డి సంపాదించుకున్నారంటే ఆయనకున్న మహోన్నతమైన వ్యక్తిత్వమే అందుకు కారణం.

అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖలో రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆదా చేయడంలో కీలకంగా నిలిచారు. ప్రత్యర్థులపై విరుచుకు పడటంలో.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారి తాట తీయడంలో ముందుంటారు. అన్నింటికీ అండగా.. వైఎస్ జగన్ మనస్సు గెలిచిన నెల్లూరు ధీరుడు అనిల్ కుమార్ యాదవ్ గా చెప్పవచ్చు. ఇక ఆదిమూలపు సురేష్ విద్యావంతుడు. ఓదళితుడుగా స్వశక్తితో ఎదిగి ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థానానికి చేరుకొని ప్రజల మనస్సు తెలుసున్నారు. దీంతో వైఎస్ జగన్ ఇష్టపడి సురేష్ ను విద్యాశాఖ మంత్రిని చేశారు. అదే తడవుగా.. విద్యావ్యవస్థలో వైఎస్ జగన్ ఆలోచనలను ఆచరించడంలో నిరంతరం పాటుపడుతున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు నాడు-నేడు వంటి కార్యక్రమాలను ఆచరణాత్మకంగా అమలు చేస్తూ విలక్షణంగా నిరంతరం ప్రజాసేవకై పరితపిస్తున్నాడు.

ఇక బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖామంత్రిగా అమరావతి అక్కడ తగదని వాదిస్తూ వచ్చి తిరిగి తాను అనుకున్న స్కెచ్ ను పకడ్బంధీగా అమలు చేయడంలో సక్సెస్ కొట్టారు. అనుభవం కలిగిన రాజకీయ నేతగా వైఎస్ జగన్ ఆలోచనలను ఎప్పటికప్పుడు పెద్దరికంగా అమలు చేస్తూ.. ఆ దిశగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఏపీలో వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి సాధ్యమని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ విలక్షణమైన రీతిలో ప్రజల మనస్సును చూరగొన్నారు.

చివరగా పుష్పశ్రీవాణి. ఉపముఖ్యమంత్రిగా.. గిరిజన శాఖమంత్రిగా వైఎస్ జగన్ కేబినేట్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తన మాటల తూటాలతో వైవిధ్యభరితమైన మంత్రిగా పాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అనేది ఓ పేరు కాదని.. అది ఓ బ్రాండ్ అన్నారు. అంతటితో ఆగకుండా.. దానికి ట్యాగ్ లైన్ చెప్పాడంటే.. చేస్తాండంటే… అధ్యక్షా.. అంటూ తన మాటల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వైఎస్ జగన్ కేబినేట్ లో అంతా సత్తా ఉన్నవారే… కానీ ప్రజల్లో కాస్త బాగా వైరల్ అవుతోన్న వీరు నవరత్నాల్లా 9మిషన్ గన్స్ అని చెప్పవచ్చు