ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అభివృద్ధే ప్రధానంగా చకచకా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా వైఎస్ జగన్ రైతుల కోసం ఆటో మ్యూటేషన్ సేవలను స్టార్ట్ చేశారు. అదేమంటే.. ఇవో రకం సేవలు అని అధికారు వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఈ సేవల్ని ప్రారంభించారు. ఐతే… దీనిపై ఎక్కవగా ప్రభుత్వం ప్రచారం చెయ్యలేదు. కానీ ఇవి చాలా కీలకమైన సేవలు. అందుకే ఇవేంటో తెలుసుకుంటే మంచిదని అందరికీ తెలియజేసేందుకు ప్రజాచైతన్యం ఛానల్ మీకోసం ప్రసారం చేస్తున్న ఎక్స్ క్లూజివ్ వీడియో ఇది.

అయితే ఆటో మ్యూటేషన్ సేవలు… ఇవి ఏపీలో రెవెన్యూ శాఖలో అమలవుతున్నాయి. ఇకపై భూ యాజమాన్య హక్కుల మార్పిడి (మ్యూటేషన్) చాలా ఈజీగా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నమాట. ఇప్పటివరకు రైతులు తమ భూముల్ని అమ్మాలన్నా, కొనాలన్నా… ఆ వివరాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తహసీల్దారు ఆఫీస్, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇందుకు ఎక్కువ టైమ్ పట్టేది. అలాగే లంచాలు కూడా ఇచ్చుకోవాల్సి వచ్చేదనే ఆరోపణలు కూడా ఈ విషయంలో పెద్దఎత్తున వెల్లువెత్తిన విషయం గతంలో చూశాం. విన్నాం. అదే కొత్త సేవల వల్ల రిజిస్ట్రేషన్ చేసిన భూముల వివరాలు… రెవెన్యూ రికార్డుల్లో వెంటనే మారిపోతాయి. ఇకపై భూ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే… రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్ భూమి మార్పు కోసం ఎలాంటి డబ్బూ చల్లించను అక్కర్లేకుండా భూరికార్డుల మార్పిడి నమూనా వివరాలు ఆన్‌లైన్‌లో రెవెన్యూ శాఖకు వెళ్తాయి. అలా అక్కడ అవి రికార్డై… ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికీ వీలౌతుంది అన్నమాట.

అదేవిధంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ సేవల్ని విజయవంతంగా అమలు చేసింది. ఆ తర్వాత ఇవే సేవల్ని రాష్ట్రమంతా అమలుచేసింది. ఇకపై భూ రిజిస్ట్రేషన్ మొదలు, ఈ-పాస్‌బుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. అందువల్ల ఇకపై భూపట్టాదారులు ఆన్‌లైన్ భూమార్పులు అంటే భూబదలాయింపుల కోసం తహశీల్దారు ఆఫీస్, మీ సేవా కేంద్రాలకు వెళ్లి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పనిలేదు. భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్‌డేట్స్… పట్టాదారు మొబైల్ నంబర్‌కి ఎస్ఎమ్ఎస్ ద్వారా అందుతుంది. 30 రోజుల్లో తహశీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ఆర్ఓఆర్ వన్ బిలో పర్మనెంట్‌గా నమోదవుతుంది. తద్వారా ఈ-పాస్‌బుక్ వెంటనే పొందడానికి వీలౌతుంది. ఈ ప్రక్రియ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.