ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నారు. అందుకోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల కోసం ఏకంగా శాసనమండలిలో రద్దు చేశారు. దీంతో వైసీపీలో రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కోల్పోయింది. ఇప్పుడు రాజ్యసభకు సీట్లకు డిమాండ్ పెరిగింది. కాస్త ప్రజల్లో హుందాగా ప్రజాసేవ చేయాలని ఉన్న నేతలు రాజ్యసభ సీటు కోసం వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో పరాజయంతో… సీఎం వైఎస్ జగన్‌తో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్రంగా చర్చలు జరిపారు. అయితే వారి మధ్య జరిగిన చర్చలు ఏమిటి అన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులను వేధిస్తోన్న ప్రశ్న. ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ సంఖ్యాబలం పెరగనుంది. దీన్ని అవకాశంగా తీసుకోనుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు రానున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఆ పార్టీ సంఖ్య రాజ్యసభలో ఆరుకు పెరుగనుంది.

అయితే ఇప్పుడు రాజ్యసభకు వైసీపీ ఎవరిని పపంనుంది అనేది ప్రజలందరిలో తొలుస్తున్న ప్రశ్న. ఎవరిని పంపాలన్న దానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇప్పటికే పలురకాల పేర్లు మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో శాసనమండలి రద్దు కానుండటంతో మంత్రులైన మోపిదేవి వెంకటరమణ, పిల్లు సుభాష్ చంద్రబోస్ పదవిపోనుంది. దీంతో వీరిని రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నారని కొంతమంది భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా మరికొంత మంది వైసీపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా నామినేట్ కానున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వారిలో ఒకరు రామ్‌కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కాగా, మరొకరు టీడీపీని వీడి వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త బీద మస్తాన్‌రావ్. వీరిద్దరికీ రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి వైసీపీ తరపున లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వీరి పేరు కూడా హల్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.