ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ చాలా చకచకా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏళ్లతరబడి పరిష్కారం కానీ.. సమస్యలను చాలా వేగంగా పరిష్కరించేలా జగన్ పావులు కడుపుతున్నాయి. అందుకోసం చట్టాలను చేస్తున్నారు. అవసరమైతే అడ్డు వచ్చిన కొన్ని చట్టసభలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా రద్దు చేసేస్తున్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఏపీలో సమగ్రాభివృద్ధిని కాంక్షించిన వైఎస్ జగన్ వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి అందుకోసం వేగవంతంగా పావులు కదిపారు. అసెంబ్లీ సాక్షిగా అందుకోసం అమరావతి, వైజాగ్, కర్నూల్ లను అధికారిక రాజధానులను ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసి శాసన సభకు పంపించారు. అయితే ప్రతిపక్షం చాలా తెలివిగా ఆ తీర్మాన్ని వ్యతిరేకిస్తూ.. సెలక్ట్ కమిటీకి పంపించడంతో అసలు ఇలాంటి శాసన మండలి మనకు అవసరమా అంటూ వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి నివేదికను పంపించడం కూడా జరిగిపోయింది.

అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఢిల్లీలో ఏవిధంగానైనా సరే లాబీయింగ్ చేసి శాసనమండలిని రద్దుకాకుండా చూడాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రానికి పంపిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అడ్డుకొనే విధంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు నేతలకు వ్యూహాలను సూచిస్తున్నాడు. ముఖ్యంగా పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీలు ఓ పక్క జారి పోకుండా వారికి ధైర్యాన్ని నూరుపోస్తూ మరోపక్క పలువురు బీజేపీ పెద్దలతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. బాబు తన మెదడుకు పదును పెడుతున్నారు. అసలే రాజకీయాలు చేయడంలో అపర చాణక్యుడుగా పేరొందిన నారా చంద్రబాబు నాయుడి ఎత్తులకు పైఎత్తులు వేసి ఏవిధంగానైనా తీర్మానాన్ని ఓకే చేయించుకొనేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే బీజేపీ.. అధికార వైసీపీకి అన్ని విషయాల్లోనూ సానుకూలంగా వ్యవహరిస్తూ.. చాలా సమీప సంబంధాలను నెరపుతుంది. అసలెందుకు ఏపీలో జరిగే తంతు అంతా కూడా కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తుంది అనే టాక్ కూడా ఉంది.

అయితే చంద్రబాబు మాత్రం వైసీపీ.. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ఎక్కడ ఏ పాచిక వేస్తే అక్కడ చెల్లుతుంది అనేదానిపి మనస్సు కేంద్రీకరించినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు మండలి రద్దును వ్యతిరేకించాలని బాబు డైరెక్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది. అంతటితో ఆగకుండా అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్లినప్పటి నుంచీ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకొనేందుకు బాబు ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌ ముందుకు మండలి రద్దు అంశం రాకుండా ఉండేందుకు బాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఇప్పటికే కొంతమంది నేతలు.. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే సుజనా చౌదరి వంటి నేతల ద్వారా బాబు అడ్డుకొనేందుకు సర్వ అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మండలి రద్దు కాకుండా ఉంచేందుకు అవసరమైతే టీడీపీ నుంచి సగం మంది ఎమ్మెల్సీలను బీజేపీలో చేర్చి తద్వారా తాము నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తన్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే.. టీడీపీ ఎమ్మెల్సీలు పలువురు బీజేపీలో చేరినా.. బాబు మాటే వింటారని అందుకోసం బీజేపీలో చేరిన తమకెలాంటి నష్టం ఉండదని కూడా బాబు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా సుజనా చౌదరిని రంగంలోకి దింపి మధ్యేమార్గంగా వ్యవహారాలను నడిపే ఏర్పాట్లు కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.