కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో హడావుడిగా ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అయితే సోనియా గాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ శ్రేణులు కలవరానికి గురౌతున్నారు. ఈ విషయం తెలియగానే.. పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. జ్వరం..శ్వాస సంబంధ సమస్యతో సోనియా బాధపడుతుండటంతో హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆందోళనేమీ లేదని.. స్వల్ప అనారోగ్యమేనని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

అదేవిదంగా ఆమె హెల్త్ కండీషన్‌పై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. గత కొంత కాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందే అమెరికాలో ప్రత్యేక వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ అనారోగ్యంతో కొన్నాళ్లు ఆస్పత్రిలో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు సోనియాగాంధీ. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటుంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆమె సర్ గంగారాం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారన్న సమాచారం తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.