కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్నే ఊకిరి బికీరి చేస్తున్న సమస్య. ప్రపంచంలో కొన్నీ లక్షల మంది చావుకి కారణం అవుతున్న ఈ ఘోరమైన వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది….!

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా కరోనా వైరస్ పేషంట్ల ను గుర్తించిన డాక్టర్స్ ప్రస్తుతం వారికి చికిత్స అందజేస్తున్నారు.

అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి తగిన జాగ్రతలు వెంటనే తీసుకోవాలని చెప్పుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశం పై హై అలర్ట్ ప్రకటించింది. దేశం మొత్తం తగిన జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది.

అలాగే డాక్టర్ల సూచన ప్రకారం క్రింద ఉన్న ఏడు జాగ్రత్తలను సరిగా పాటిస్తే కరోనా వైరస్ మన వద్దకు రాదని చెప్తున్నారు :-

ఎప్పటికప్పుడు సాని టైజర్ తో చేతులు బాగా శుభ్రం చేసుకోవడం.

సబ్బుతో ఎక్కువ సేపు చేతులు కడగడం ఉత్తమం.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

జలుబు దగ్గు వస్తే వెంటనే అప్రమత్తం ఐయ్యి హాస్పటల్ కి వెళ్ళడం ముఖ్యం.

ఇతరులు చెప్పే ఎలాంటి అపోహలు నమ్మవద్దు.

కరోనా వైరస్ పీడిత దేశాల నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలి. నిజానికి వారితో కొద్దీ కాలం దూరంగా ఉండటం మంచిది.

జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించడం అతిముఖ్యమైన అంశం.

ఇలా తగిన జాగ్రతలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచీ దూరంగా ఉండవచ్చు….అలాగే మన మీడియా లో చూపించే ప్రతి వార్తను వెంటనే నమ్మ వద్దు, అవ్వని వారి ఛానెల్ టీఆర్పీ కోసం మీడియా వారు పడే పట్లే!