నందమూరి బాలకృష్ణ, ఈ మనిషి అంటేనే రౌద్రం. అది కూడా కేవలం సినిమాల్లోనే నటసింహం బాలయ్య. మరి రాజకీయాల్లో అన్ని అడిగితే మాత్రం అయిన సొంత అభిమానులు సైతం ఆలోచించే పరిస్థితే. నిజానికి బాలయ్య తమ కుటుంబానికి బలమైన పట్టు ఉన్న హిందూపురం నియోజీక వర్గం కాబట్టి ఎలాగో అలాగా ఎమ్మెల్యే గా నెగ్గుకు పోతున్నారు, పైగా ఎలాగో సినిమా స్టార్ గా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ తోపాటు గా బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ పెట్టీ బాలయ్య చేస్తున్న సేవ కూడా సామాన్య జనాలు సైతం అందరూ అయిన్ని మెచ్చుకునే అంశమే. అందుకే స్పష్టంగా ఒక ప్రసంగం కూడా ఇవలేని బాలయ్య. అధిక మెజారిటీ తో ఇంకా అసెంబ్లీకి వెళ్ళగలుగుతున్నారు.

ఇక అసలు విషయానికి వేస్తే తెలుగు దేశం పార్టీ కి బలం బలగం మోతం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు గారు మాత్రమే. ప్రస్తుతం పార్టీ పరిస్థితే కాదు పార్టీ అధినేత పరిస్థితి కూడా బాగాలేదు. పైగా మొన్న విశాఖపట్నం లో జరిగిన సంఘటన తరువాత బాబు గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్ని సమాచారం. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీని ముందుకు నడిపించడంలో ఎవరు ముఖ్య పాత్ర పోషిస్తారు అన్నే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బాబు గారికి వయసు కూడా పెరిగిపోతుంది. పార్టీకి ప్రస్తుతం సరికొత్త నాయకత్వం అవసరం. మరి చాలా మంది వారి వారసుడు – కుమారుడు నారా లోకేష్ గురించి ఆలోచిస్తే గత ఎన్నికల్లో పార్టీకి ఆయనగారి వల్ల కలిగిన నష్టం ఇక చాలు అన్ని కొంతమంది టిడిపి పార్టీ నాయకులే బహిరంగంగా చెపుతున్న విషయం.

మరి ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ నీ ముందుండి నడిపించేది ఎవరు ? ఇప్పుడు… ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ సీపీ వంటి బలమైన పార్టీ నీ ఎదుర్కోవడానికి నేరుగా నందమూరి బాలకృష్ణ గారి కుమార్తె , అలాగే నారా లోకేష్ గారి శ్రీమతి నారా బ్రాహ్మణి గారు తెరపైకి వచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో చంద్ర బాబు గారి నివాసంలో జరిగిన చిన్న పార్టీ లో టిడిపి ముఖ్య నేతలందరూ వారి వారసులతో అలాగే టిడిపి పార్టీ కి చెందిన ముఖ్య యువ నేతలందరూ హాజరు ఐయ్యారు అన్ని సమాచారం. ఈ పార్టీ బ్రాహ్మణి నీ టిడిపి పార్టీలోని ముఖ్య నాయకులందరికీ పరిచయం చేయడం కోసమే అన్ని తెలిసింది. మరి చూడలీక మొత్తానికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు తన కోడలు నారా బ్రహ్మణి నీ సడెన్ గా తెరపైకి తేవడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఎంతో మరి….!

ఇక నారా బ్రహ్మణి కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీ నేతలతో కలిసిపోయి మాట్లాడటం విశేషం. ఈ విధంగా టిడిపి పార్టీ అధినేత నారా చంద్రాబునాయుడు గారు విశాఖపట్నం లో జరిగిన సంఘటన తరువాత హైదరాబాద్ లో జరిపిన ఈ విందు రాజకీయం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి…. అలాగే పార్టీ లో బ్రాహ్మణి తండ్రిగారు మన నందమూరి బాలకృష్ణ గారు తన కూతుర్ని చూసి ఎంతో మురిసిపోయారాట్ట.