డబ్బు పంచుతుంటే అడ్డుకోండి వీడియోలు తీసి షేర్‌ చేయండి ఇందుకోసం ఎన్టీఆర్‌ భవన్‌లో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఉదయం ఆయన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, వస్తువులు పంపిణీ చేస్తుంటే వీడియోలు తీసి షేర్‌ చేయాలన్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ భవన్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు తీసిన వీడియోలు, ఇతర సమాచారాన్ని పంపాలని కోరారు. అలా వచ్చిన వాటిని ఎన్నిక అధికారులకు అందజేస్తామన్నారు. యువనాయకత్వం ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి మార్గమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.