ఒకే విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీ, నగర పంచాయతీ లకు రిజర్వేషన్లు ఖరారు. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణ. మార్చి 14 నామినేషన్లు పరిశీలన, మార్చి 16 తేదీ 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు 3 గంటలు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ప్రకటన.

ఈనెల 23 తేదీ ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పోలింగ్. మార్చి 27 తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఈనెల 31 తేదీ పరోక్ష పద్ధతి లో కార్పొరేషన్ లకు మేయర్, డిప్యూటీ మేయర్, కో అప్షన్ సభ్యులు ఎన్నిక, మున్సిపాలిటీ లకు చైర్మన్, వైస్ చైర్మన్ లు ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరణ.. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. నేడు మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీ..