ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తె బేజీ జువేరియా తెరంగేట్రం చేయనుంది. తన తండ్రి సినిమాతోనే ఈ చిన్నారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అలీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా గంగానది’.‘అంత పవిత్రమైన స్త్రీ’ అనేది ఉపశీర్షిక. నియా హీరోయిన్. ఈ సినిమాలో బేబీ జువేరియా ఓ కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. అలీకి ఇది 1109వ సినిమా. కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా దర్శకుడు బాల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముగాంభిగా బ్యానర్‌‌లో వి. నాగేశ్వరరావు, సూర్యవంతరం, ఎం.ఎన్.యు. సుధాకార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.