రాజ్యసభకు వర్ల రామయ్యను అభ్యర్థి గా పోటీలో పెడుతున్నాం. వైకాపా ఎమ్మెల్యేలు ఆలోచించాలి తాము తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో, తాము చేసేది తప్పని భావిస్తే వర్లకు ఓటెయ్యాలి తప్పని తెలిసినా భయపడితే వైకాపా అభ్యర్థులకు ఓటేస్తారు. మా ఎమ్మెల్యేలందరికి విప్ జారీ చేస్తాం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు పార్టీ ఏజెంట్ కి చూపించి వేయాలి. దీనిని ఉల్లంఘిస్తే అనర్హత కు గురవుతారు