ఇదేం ‘స్థానిక’ రాజకీయం జగన్‌ గారూ?: అచ్చెన్నాయుడు ధ్వజం నామినేషనే వేయినివ్వకపోతే ఎన్నికలెందుకు పోటీని అడ్డుకోవడం నీచరాజకీయం కాదా నియంతలా వ్యవహరిస్తున్నారు ప్రత్యర్థులు పోటీ చేయడానికే అవకాశం ఇవ్వనప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించి లాభం ఏమిటని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తున్న ప్రత్యర్థుల నామినేషన్‌ పత్రాలు గుంజుకుని, చించేసి వారిని బెదిరించి పోటీని అడ్డుకోవడం నీచ రాజకీయం కాదా? అన్నారు. ‘అధికారం ఉందన్న అహంభావంతో అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఓ నియంతలా ప్రత్యర్థులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?’ అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.