బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాయింట్స్….
రాష్ట్రం బీహార్ ను తలపిస్తోంది
బీహార్ లో కూడా ఇన్ని అక్రమాలు, అఘాయిత్యాలు జరిగాయని అనుకోవడం లేదు
మేం వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి… ఇపుడు ప్రజలు ప్రశాంత జీవనం కోల్పోయిన పరిస్థితి
కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారు
దౌర్జన్యం, దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు
విజయం సాధించకపోతే ఎమ్మెల్యేల అంతు చూస్తానని సీఎం బెదిరించారు
దీంతో ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారు
గతంలో టెండర్ల వద్ద ఫ్యాక్సనిస్టుల బెదిరింపులు చూశాము
కానీ ఇపుడు ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు
పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు
ప్రభుత్వంపై పోలీసుల పై నమ్మకం లేదు
పక్క రాష్ట్రం నుంచి పోలీసులను తెచ్చి ఎన్నికలు జరపాలి
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను బెదిరిస్తున్నారు
వైకాపా కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు తొలగిస్తామని అంటున్నారు
పోలీసు వ్యవస్థ కూడా మరీ దుర్మార్గంగా తయారయ్యారు
నేను స్వయంగా డీజీపీ ని కలిసి రాజకీయ దాడులపై ఫిర్యాదు చేశా
అయినా పోలీసులు వేధింపులు మానలేదు
కేవలం 9 నెలల కాలంలో ఇంతటి అరాచకం గతంలో ఎన్నడూ లేదు
ముఖ్యమంత్రి చెప్పే నీతులు కేవలం మాటలకే పరిమితం
ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ మోసం చేయడానికే
వైకాపా అభ్యర్థులు దమ్ముంటే డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లాలి
ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య జరిగితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేక సిబిఐ విచారణకు అడిగారు
ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు అవమానం ఉందా
మరి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా.. డిజిపి రాజీనామా చేస్తారా
గతంలో సిబిఐ విచారణ అడిగిన జగన్ ఇపుడు ఎందుకు మాట మార్చారు
డేటా చోరీ విషయంలో నానా గోల చేసిన జగన్ ఆ కేసును ఏం చేశారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి
వైకాపా గుండాలు స్థానిక ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేయనీయటం లేదు
మా పార్టీ తరపున నిలబడే వారిని, కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు
ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు… అందరినీ నామినేట్ చేసుకుంటే సరిపోయేది
ప్రభుత్వ ఆర్డినెన్స్ కేవలం ప్రతిపక్ష పార్టీలను బెదిరించటం కోసమే
ఈ పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అడప శివ నాగేంద్రరావు, పాలపాటి రవికుమార్, పాలిసెట్ రఘు, నేరేళ్ల సురేష్, నిజాముద్దీన్, పరుచూరి సంజీవరావు, బీజేపి రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు….
Recent Comments