గుంటూరు జిల్లా మాచర్ల లో టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలు… దుర్గి కి మధ్యలో కొంతమంది వైసిపి కార్యకర్తలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు గారి పై కత్తులతో కర్రలతో రాళ్లతో దాడి… ఈ ఘటనలో 2 కారు అద్దాలు ధ్వసం…

మాచర్ల ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాం – మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు – మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు – కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‍ను కొట్టారు – మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారుతోంది – డీఎస్పీపై కూడా దాడి చేశారు – పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది – ప్రాణాలతో బయటపడతామనుకోలేదు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ

పల్నాడులో మా పర్యటన వివరాలను వైసీపీకి పోలీసులు అందించారు – అడుగడుగునా మాపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు – పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు : టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న