కర్నూలు కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్నారు. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన చెందిన ఆయన.. వారితో సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చారు. రాజీనామా అనంతరం కేఈ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని వీడటం బాధగా ఉందన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెసు పార్టీ విధానాలనే టీడీపీలోనూ అవలంబిస్తున్నారు. తన అన్న కేఈ క్రిష్ణమూర్తి పార్టీ మారతారా? లేదా? అన్నది ఆయన ఇష్టమన్నారు. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని.. వస్తే వెళ్తానని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు.