తమ్ముడి రాజీనామాపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ప్రభాకర్ తనతో మాట్లాడలేదని, వైసీపీలోకి వెళ్తే అభ్యంతరం లేదన్నారు. కాగా డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేఈ కృష్ణమూర్తి స్వయంగా వెల్లడించారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌, 32 వార్డులు దానం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన, టిడిపి ఒక టాను లో ముక్కలే