IPL 2020: కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పడిన నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్ 15 వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 75కు చేరింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా.. ఫ్రాంచైజీల నుంచి విముఖత వ్యక్తమైంది. అలాగే ఒకవేళ టోర్నీని రద్దు చేస్తే బీసీసీఐ వేలాది కోట్లు నష్టపోవాల్సి వస్తుంది.

అందుకే బీసీసీఐ అధ్యక్షుడు మిగతా టీమ్ మెంబర్స్‌తో సమావేశమయ్యి.. ఈ నిర్ణయానికి వచ్చాడు. కాగా, టోర్నీని నిలిపివేయాలని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి లేఖలు అందడమే కాకుండా.. కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. అంతేకాకుండా విదేశీయులకు వీసాలను ఏప్రిల్ 15 వరకు నిలిపివేయాలని కేంద్రం తీసుకున్న  టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.