ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించినట్టు సమాచారం. ఈ పథకం వ్యక్తిగత లబ్ది కిందకు వస్తున్న కారణంగా ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఎన్నికల కమిషనర్ రమేషన్ కుమార్ ఆదేశించారు. సీఎం జగన్ అభివృద్ది కార్యక్రమాల పై సమీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

మార్చి 25న ఉగాది పర్వదినాన ఇళ్లు లేని పేద ప్రజలందరికి కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టివ్వాలని సర్కార్ నిర్ణయించింది. దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టకుంది.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. మార్చి 29తో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది