ఆంధ్రా సినిమా…వ్యూహరచన..ఢిల్లీ పెద్దలదే!
కధా వస్తువు …. ఆపరేషన్ టీడీపి క్లీన్…
స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వ్యూహం క్రమబద్దంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు.
వారి ప్రయత్నాలు ప్రస్తుతం మిశ్రమ ఫలితాలే ఇస్తున్నాయి.
దేవుడు శాసిస్తాడు..అరుణాచలం పాటిస్తాడు.
కేంద్రం చెబుతుంది..జగన్ అమలు చేస్తాడు..
గత సార్వత్రిక ఎన్నికలు..వరకు అయితే కచ్చితంగా అవి మోదీ vs చంద్రబాబు జరిగాయి..
ఏం చేసెయినా ..గెలవాలనుకున్నారు…
మళ్ళా కనీసం పదేళ్ళ పాటు లేవకుండా దెబ్బకొట్టామనుకున్నారు.
ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి మరి..
పీచు మిఠాయి కావాలని ఏడ్చిన కుర్రాడికి జీడిపప్పు పాకం కొనిపెట్టినట్టు ..అపూర్వవిజయం తిరుగులేని అధికారం వచ్చిపడింది.
పోన్లే మనదొడ్లో పడి ఉండేవాడే…ఎప్పుడు కావలిస్తే అప్పుడే కట్టేయవచ్చు.
ఒకదాని వెనుక ఒకటి జరుగుతున్నదంతా వ్యూహం ప్రకారమే…
చంద్రబాబు ని తొక్కటం తో పాటు..ఆంధ్రావాళ్ళు ..ఆంధ్రా మళ్ళా కోలుకోకుండా ..
ఏ ఇతర రాష్ట్రానికి ఏవిధంగానూ పోటికి రాకుండా చంకనాకిపోవటం బోనస్!
జనానికి అర్దం అయ్యి అవకుండా …
చెవుల్లో దూది..కళ్ళలో డ్రాప్స్ వేసినట్టు..కులం..మతం..ప్రాంతం లాంటి చిచ్చు పెట్టేసారు..
కొంతమంది మేధావులు చుచ్చును ఎగదోసే పనిలో ఉంటారు.
అయితే ఎంత పకడ్బందీ వ్యూహం పన్నినా..తెరవెనుక ఉండి నడిపించాలన్నా..
పధకం అమలు చేసే వాడికి కూడా బుర్ర ఉండాలి.
ఇక్కడ అమలు చేసేవాడు క్రూరుడు..అవివేకి..
కేంద్రపెద్దల అండగా ఉంది కదా!
తనసొంత ఎజెండా…కులద్వేషం ..ముఠాతత్వం అమలు చేస్తున్నాడు.
ఇక్కడి వ్యవహారం పెద్దలకి కొన్ని నచ్చకపోయినా..
తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోవాల్సివస్తుంది.
వ్యవస్దల్నిటికీ అర్దమయింది..కేంద్ర సూచన ప్రకారమే అంతా నడుస్తుందని.
అందుకే కనీవినీ ఎరుగని అరాచకం నడుస్తుంది..
అప్పుడే అవ్వలేదు…
ఇంకా చూస్తాం…
ఎందుకంటే..టీడీపి ని ఖాళీ చెయ్యాలంటే…
తెలంగాణాలో ఆంధ్రాపార్టీ అని ముద్ర పడిన ఆంధ్రా నాయకత్వం ఉన్న టీడీపి ని ముఖ్యనాయకులని లాక్కుని ..ద్వితీయ స్దాయి నాయకత్వాన్ని కూడా కలుపు కోవటానికి..పధ్నాలుగేళ్ళు పట్టింది..తీవ్రమైన భావోద్వేగ..సున్నితమైన తెలంగాణా సెంటిమెంటు ఉండటం వలన..
ఆంధ్రాలో ఎన్నాళ్ళు పడుతుందో కాలమే నిర్ణయించాలి.
తెలంగాణా లో టీఆరెస్ కి బలమైన నాయకత్వం..తదనంతరం కూడా గట్డి నాయకత్వం ఉంది.
ఆంధ్రాకొచ్చేసరికి జగన్ తర్వాత ఎవరు?
ఇవాళ కాకపోతే రేపు వారు శిక్షకు గురవ్వకతప్పదు.
చంద్రబాబు ని..టీడీపి ని ఎంత తొక్కాలనుకున్నా వారి విధానాలు..పాలన..
టీడీపి బతికిస్తుంది..చస్తుందని వదిలేసిన పాము లేచి బుసలు కొడుతుంది.
ఈ లోగా స్దానిక ఎన్నికలు..పోలీసు..రెవెన్యూ..అధికారయంత్రాంగం మొత్తం…వాటికి తోడు ఎన్నికల కమీషను..అంతా కలిసినా…
ఎక్కడిక్కడ నామినేషన్లు అడ్డుకున్నా…అక్రమకేసులు బనాయిస్తున్నా..
నామమాత్రం గా యునానిమస్ చేసుకోగలిగారు.
టీడీపి ప్రతిఘటన మార్వలెస్! ఎవరూ ఊహించని..ఆమాట కొస్తే టీడీపి నాయకత్వం కూడా ఊహించలేదు.
ఇక లాభం లేదు పెద్దతలకాయల్ని లాగేసుకోవాలి..
ఇష్టంగానే…అయిష్టంగానో…బతిమాలో..భయపెట్టో..బెదిరించో…
మొత్తం మీద వలసల కార్యక్రమం మొదలు పెట్టారు.
వెళ్ళే వాళ్ళలో సింహభాగం టీడీపి కి గుదిబండలే!
వారు వెళ్ళటం వల్ల నష్టం జరగదని చెప్పలేం..కాని ఇప్పటికిప్పుడు టీడీపి అధికారంలోకి వచ్చేది లేదు..
చాలా సమయం ఉంది…
వాస్తు ప్రకారం కూడా ఈ బరువుతగ్గటం టీడీపి కి మంచిదే!
మళ్ళీ ఎన్నికలొచ్చే లోపల టీడీపి ని ఖాళీ చేయాలన్న ఆపరేషన్ పూర్తిగా విజయవంతమయ్యే సూచనలు లేవు…
వెళ్ళే వారు …కొత్తవారికి చోటిచ్చినట్టే…
పార్టీ ఫిరాయింపులు కొత్తగా చేరికలు నిరంతర ప్రక్రియ…..
నడుస్తున్న సినిమా స్క్రీన్ ప్లే..దర్శకత్వం..ఫలితం
భవిష్యత్తులో తెలుస్తుంది.
ఏమి ఆశించి చేస్తున్నారో అది మాత్రం నెరవేరే ఛాన్సు లేదు.
ఎవరు ఏమి చేయాలన్నా ప్రజల మద్దతు ఉండాలి.
ఏ కొప్పు పెట్టుకోవాలన్నా జుట్టుండాలి కదా!
ఈవీయమ్ లు భవిష్యత్తులో సహకరించే పరిస్దితి లేదు…
అది ఢిల్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయ్యింది.
చంద్రబాబు మొగమాటం తో …పంపించలేని వారిని లాక్కుని ఆయన నెత్తిన పాలు పోస్తున్నారు.
ఈ క్రమంలో కొంత నష్టం జరుగుతుంది..తప్పదు భరించాలి.
ఈ లోగా చంటిపిల్లాడికి కూడా ఈ నాటకం ఆడించేదివాళ్ళే..ఇక్కడి వాళ్ళు కేవలం పాత్రధారులే అని తెలిసిపోతుంది.
తప్పదు టీడీపి ఔత్సహికులు…నాయకత్వం వహించాలనుకున్న వాళ్ళు తమ ప్రయత్నాలు చేసుకోవచ్చు…
ఇదే సరైన సమయం. ఒక యువనయకుడు గా నేను సిద్దం మరి మీరు సిద్దమా ,,,,,,,,,,,, నవతరమా,,,యువతరమా,,,,,, ,,,,, నిజం వైపు నిజాయితీ గా,,,,,,నిలుద్దా.,,,,,,,,, రండి,,,,,,,,కదలి రండి జై చంద్రబాబు,,,,,,,, జై లోకేష్,,,,,, జై తెలుగదేశం