ట్విట్టర్ అంటే తెలుసుగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ వరకు అందరూ భయపడతారు. ఎందుకంటే ఎక్కడైనా నోరు జారారో “ట్విట్టే” దొరికిపోయినట్టే! ఇతర సామాజిక మాధ్యమాల కంటే ట్విట్టర్‌ వినియోగదారుల్లో అత్యధికులు విద్యావంతులు, వృత్తి నిపుణులు. మన నాయకులు ఎక్కడ టంగ్‌ స్లిప్ అయినా ఒక రేంజిలో ఆడేసుకుంటారు. వారి తెలివి తక్కువతనాన్ని బట్టబయలు చేయటమే కాదు బట్టలు చిరిగేదాకా ఉతుకుతారు. ఆ ఉతుకుడు బారిన పడిన వాళ్లలో మన ప్రధాని మోడీ నుంచి యువ నేత రాహుల్ గాంధీ వరకూ ఉన్నారు.

ఇప్పుడు వారి సరసన చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా పోతుందని, పారాసెట్మాల్ వేసుకుంటే చాలని అదే కరోనాకు మందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు గత ట్వంటీ ఫోర్ అవర్స్‌ నుంచి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ ఆడేస్తున్నాయి. ఎంతలా ఏపీ సీఎంను ఆడుకుంటున్నాయి అనటానికి ఉదాహరణ ఏంటంటే ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రిండింగ్ అయిన పదం #BleachingPowder (బ్లీచింగ్ పౌడర్). పిడికెడు బ్లీచింగ్ పౌడర్ లేకనే అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు అల్లాడుతున్నాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా మందు కనుగొన్న ఆంధ్రా సీఎంకి వైద్యరంగంలో నోబుల్ ఇవ్వాల్సిందేనని వెటకారంగా స్పందిస్తున్నారు. కేవలం ఏపీ నుంచి కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విమర్శలు రావటంతో ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి ఏపీ సీఎం కామెంట్ బ్లీచింగ్ పౌడర్ చేరింది.

జగన్ సీఎం అయి 10 నెలలు అయింది. ఇప్పటిదాకా ఇసుక కొరత, మూడు రాజధానులు, అమరావతి తరలింపు వంటి ఎన్ని కీలక సమస్యలు ఉన్నా మీడియా సమావేశం పెట్టని ఏపీ సీఎం తొలిసారి కరోనాపై పెట్టిన ప్రెస్‌మీట్‌లో ఇలా బుక్కయిపోవటంతో ఇంకోసారి ప్రెస్‌మీట్‌ పెట్టకపోవచ్చని కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు కామెంట్ చేయటం విశేషం

.నవ్వులపాలవుతున్న ఆంద్రా సీఎం ట్విట్టర్‌లో ఆలిండియా టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?