• టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
  • పాల్గొన్న జిల్లా, నియోజకవర్గ, మండల టిడిపి నేతలు
  • స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై అన్ని చోట్లా ప్రెస్ మీట్ లు పెట్టాలి
  • అన్ని జిల్లాలలో ఎస్పీలకు, కలెక్టర్లకు వినతులు ఇవ్వాలి.
  • బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదు చేయాలి.
  • వైసిపి దుర్మార్గాలపై ఆర్వోలకు ఫిర్యాదులు ఇవ్వాలి.
  • మళ్లీ ఇలాంటి తప్పులు చేయాలంటే భయం రావాలి.
  • మీ దగ్గర సాక్ష్యాధారాలను ఎన్టీఆర్ భవన్ కు పంపాలి
  • మావద్ద సమాచారాన్ని మీకు పంపిస్తాం.
  • చట్టంలో నిబంధనలను తెలుసుకోవాలి, పాటించాలి.
  • వాటిని ఉల్లంఘిస్తే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయాలి.
  • దొంగతనంగా మా ఇళ్లకు ఎలా వస్తారు, ఎందుకు వస్తారు..?
  • బైండోవర్ చేసేందుకు వస్తే రాసిమ్మని అడగాలి.
  • పౌర స్వేచ్ఛ హరించమని ఏ చట్టం చెప్పదు.
  • రాజ్యాంగంలో ఏ నిబంధన (పౌర స్వేచ్ఛ హరణ) అనుమతించదు.
  • దుర్మార్గాలు చేసినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు.
  • ఏ తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి..?
  • అనేక చోట్ల వైసిపి దుర్మార్గాలు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
  • వైసిపి గుండాల దౌర్జన్యాలను అడ్డుకున్నారు. ధైర్యంగా ఎదుర్కొన్న అందరికీ అభినందనలు.
  • రాష్ట్రంలో సాధారణ పాలన పడకేసింది. విధ్వంస పాలన, వివక్ష పాలన నడుస్తోంది.
  • తాను చెప్పిందే జరగాలనే జగమొండి పాలన. జరగకపోతే జగమొండి భరించలేడు.
  • చట్టం మనకెంత ముఖ్యమో వాళ్లకూ అంతే ముఖ్యం.
  • మీరు పంపిన 30వీడియోలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాయి.
  • ఉన్మాదులను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గం. దుర్మార్గ ప్రభుత్వాన్ని నియంత్రించే మార్గం ఇదే.
  • గతంలో బాంబులతో వస్తేనే ధీటుగా ఎదుర్కొన్నాం. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాం.
  • అలాంటిది పోలీసులను అడ్డం పెట్టుకుని ఇప్పుడు తప్పుడు కేసులు పెడ్తామంటే భయపడ్తారా..?
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమనే సందేశం పంపారు. అందరికీ అభినందనలు, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా చూపాలి.
  • ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగుల వీడియోలు పంపాలి. హోర్డింగుల ఫొటోలు, వీడియోలు పంపాలి.
  • అవకాశవాదులకు పార్టీలో స్థానం ఉండదు. పార్టీ మారేవాళ్లు చరిత్రహీనులుగా మిగుల్తారు.
  • ఈసిని కులం పేరుతో దూషణ నీచాతినీచం. 16నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2 నిందితులు ఈసిని నిందించడం హేయం.
  • దొంగలు జడ్జిని నిందించడాన్ని ప్రజలే చూస్తున్నారు. కండిషన్ బెయిల్ లోని నిందితులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారు.
  • ప్రజాక్షేత్రంలో, న్యాయక్షేత్రంలో వీళ్లకు గుణపాఠం తప్పదు.