అమరావతి: తమపై ప్రతాపం చూపిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సిగ్గుతో డీజీపీ గౌతమ్ సవాంగ్ తలదించుకోవాలన్నారు. మీ కూతుళ్లు, భార్యపై పోస్టులు పెడితే ఊరుకుంటారా అని నిలదీశారు. పోలీసులు బాడీఓన్ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. అకారణంగా తమ సోషల్మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోలీసులు సమాధానం చెప్పే రోజు తొందర్లోనే ఉందన్నారు. తీవ్ర పరిణామాలుంటాయని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. చట్టం కొందరికి చుట్టం కాదని, జగన్ మిమ్మల్ని కాపాడలేడని గుర్తుంచుకోవాలని గుర్తుచేశారు. ఏపీ ప్రజలు తెలంగాణ, కర్నాటకకు వెళ్లి రావడం లేదా? అని ప్రశ్నించారు. కరోనా రాదని జగన్ ఎలా చెబుతారన్నారు. ఉన్మాదం పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుందని, 4 వేల కోట్లు రావాలంటున్నారని, 9 నెలలు ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు.
సిగ్గుతో డీజీపీ తలదించుకోవాలి: చంద్రబాబు

Recent Comments