అమరావతి : రాజధాని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు..తమ పిల్లల భవిష్యత్‌ మారుతుందని ఎన్నో కలలు కన్నారని చెప్పారు. ధర్మం మన వైపే ఉంది..రైతుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల ఉద్యమానికి విరాళాలు ఇస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు.