ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ
విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ధర్మాసనం
స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని సుప్రీంలో పిటిషన్
ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు

1. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు
2. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం
3. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం
4. హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా ?
5. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలి