అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల నుండి వైసీపీ ప్రభుత్వానికి వరుసగా షాక్ లు తగులుతున్నా యి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం లోనూ సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అవుతున్నది ఏపీకి 3 రాజధాని విషయంలో హైకోర్టులో రైతులు పిటిషన్ వేయగా రాజధానుల ప్రక్రియను హైకోర్టు నిలిపివేస్తుంది అసైన్డ్ భూమి విషయము లోను రైతులపై బనాయించిన కేసుల లోను ఇంకా పలు సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆదేశాలు వస్తున్నాయి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయమై ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే ఇక్కడ కూడా వైసిపికి గట్టిగా షాక్ తగిలింది అని చెప్పాలి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది కరోనా విజృంభన నేపథ్యంలో తిరిగి ఆదేశాలు ఇచ్చేంత వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది అలాగే అమరావతి రాజధాని విషయంలో హైకోర్టులో రైతుల వేసిన కేసు పెండింగ్లోనే ఉంది